Mohammed Shami | మంబై: సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ.. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. వన్డే ప్రపంచకప్‌లో తన అద్వితీయమైన ప్రదర్శనతో అదరగొట్టిన షమీ.. గతంలోనే సఫారీ టూర్‌కు ఎంపికైనా.. గాయం కారణంగా టెస్టు సిరీస్‌కు అందుబాటులో లేకుండాపోయాడు. చిలమండ గాయం పూర్తిగా తగ్గకపోవడంతో.. బీసీసీఐ వైద్య బృందం షమీకి క్లియరెన్స్ ఇవ్వలేదు.
మరోవైపు పేస్ ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ వ్యక్తిగత కారణాల వల్ల వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో సీనియర్ సెలెక్షన్ కమిటీ బెంగాల్ పేసర్ ఆకాశ్‌దీప్‌ను జట్టుకు ఎంపిక చేసింది.