WIW vs SCOW : మహిళల టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్ బీలోని వెస్టిండీస్, స్కాట్లాండ్ తలపడుతున్నాయి. చెరో విజయంతో జోరు మీదున్న ఇరుజట్లు రెండో గెలుపుపై కన్నేశాయి. హెడింగ్లే లీడ్స్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన స్కాట్లాండ్ కెప్టెన్ క్యాథరీన్ బ్రౌసీ బౌలింగ్ తీసుకుంది. హిట్టర్లతో నిండిన విండీస్‌ను స్కాటిష్ బౌలర్లు ఏ మేరకు కట్టడి చేస్థారో చూడాలి.
వెస్టిండీస్ తుది జట్టు : క్వియాన జోసెఫ్, హీలీ మాథ్యూస్(కెప్టెన్), షెమినే క్యాంప్‌బెల్(వికెట్ కీపర్), డియాండ్ర డాటిన్, స్టాఫానీ టేలర్, చిన్నెల్లీ హెన్రీ, జహ్జర క్లాక్స్టన్, జనీలీ గ్లాస్గో, అలియాహ్ అలెనీ, అఫీ ఫెచర్, కరిష్మా రామ్హరాక్.
స్కాంట్లాండ్ తుది జట్టు : డార్సీ కార్టర్, క్యాథరీన్ ఫ్రేజర్, క్యాథరీన్ బ్రౌసీ(కెప్టెన్), సరాహ్ బ్రౌసీ(వికెట్ కీపర్), ఐస్‌లా లిస్టర్, మేగన్ మెక్ కొల్, ప్రియాంజ ఛటర్జీ, రాచెల్ స్లేటర్, కిరిస్టీ గోర్డాన్, చొలె అబెల్, గాబ్రియెల్లా ఫొంటెన్లా.