Womens T20 World Cup | వరల్డ్‌కప్ బరిలో స్కాట్లాండ్, ఐర్లాండ్.. ఆ పన్నెండు జట్లు ఇవే..!
Womens T20 World Cup : మహిళల టీ20 ప్రపంచకప్ బెర్తులు ఖరారయ్యాయి. క్వాలిఫయర్స్‌లో సత్తా చాటిన స్కాట్లాండ్ (Scotland) మెగా టోర్నీకి అర్హత సాధించింది. మరో మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌ను మట్టికరిపించిన ఐర్లాండ్ ప్రపంచకప్ బెర్తు కైవసం చేసుకుంది.
Womens T20 World Cup : మహిళల టీ20 ప్రపంచకప్ బెర్తులు ఖరారయ్యాయి. క్వాలిఫయర్స్‌లో సత్తా చాటిన స్కాట్లాండ్ (Scotland) మెగా టోర్నీకి అర్హత సాధించింది. సూపర్ సిక్స్ మ్యాచ్‌లో యూనైటెడ్ స్టేట్స్(USA)ను ఓడించి కీలక పాయింట్లు సంపాదించింది. వరల్డ్‌కప్ బరిలోకి దిగనున్న చివరి జట్టుగా స్కాట్లాండ్ నిలిచింది. అంతకుముందు మరో మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌ను మట్టికరిపించిన ఐర్లాండ్ ప్రపంచకప్ బెర్తు కైవసం చేసుకుంది.
ఈ ఏడాది జూన్ – జూలై మధ్య ఇంగ్లండ్, వేల్స్ వేదికగా మహిళల టీ20 ప్రపంచకప్ జరుగనుంది. మొత్తం ఈసారి 12 జట్లు వరల్డ్‌కప్ కోసం పోటీపడనున్నాయి. గత సీజన్లో టాప్-5లో నిలిచిన ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ అర్హత సాధించాయి. ర్యాంకింగ్స్ ఆధారంగా శ్రీలంక, పాకిస్థాన్ బెర్తు పట్టేయగా.. గ్లోబల్ క్వాలిఫయర్స్ ఆధారంగా బంగ్లాదేశ్, ఐర్లాండ్, నమీబియా, స్కాట్లాండ్ టీ20 వరల్డ్‌కప్ బరిలో నిలిచాయి.
Scotland take the final spot on the plane to the Women’s T20 World Cup!
A convincing win against USA sees them become the fourth team to make the cut from the qualifiers & complete the 12-team line-up 🏴
Scorecard: https://t.co/cgpvhnpF4w pic.twitter.com/gwKGuB72nF
— ESPNcricinfo (@ESPNcricinfo) February 1, 2026
పురుషుల టీ20 వరల్డ్‌కప్‌లోకి అనూహ్య పరిణామాల మధ్య స్కాట్లాండ్ ఎంట్రీ ఇవ్వగా.. క్వాలిఫయర్స్‌లో యూఎస్ఏను ఓడించిన మహిళల జట్టు బెర్తు పట్టేసింది. డార్సీ కార్టర్ అర్ధశతకంతో మెరవగా ప్రత్యర్ధికి 179 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది స్కాంట్లాండ్. అనంతరం బౌలర్లు చెలరేగడంతో యూఎస్ఏ 137కే ఆలౌటయ్యింది. మరో మ్యాచ్‌లో ఐర్లాండ్ స్పల్ప లక్ష్యాన్ని కాపాడుకుంది. 122 పరుగుల ఛేదనలో థాయ్‌లాండ్‌ను 59 పరుగులకే ఆలౌట్ చేసి వరల్డ్‌కప్ బెర్తు సొంతం చేసుకుంది.
మహిళల టీ20 ప్రపంచకప్ జట్లు : ఇంగ్లండ్(ఆతిథ్య దేశం), ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఐర్లాండ్, నమీబియా, స్కాట్లాండ్,
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

