Womens T20 World Cup : మహిళల టీ20 ప్రపంచకప్ కోసం స్కాట్లాండ్(Scotland) బోర్డు స్క్వాడ్‌ను ప్రకటించింది. రెండోసారి మెగా టోర్నీకి అర్హత సాధించిన స్కాట్లాండ్కు క్యాథరీన్ బ్రౌసీ(Kathryn Bryce) కెప్టెన్‌గా వ్యవహరించనుంది. సోమవారం సెలెక్టర్లు ఎంపిక చేసిన 15 మందితో కూడిన పటిష్టమైన బృందంలో తొమ్మిదేళ్లుగా జాతీయ జట్టుకు ఆడని కిర్స్టిన్ గోర్డన్(Kirstie Gordon)కు చోటు దక్కింది. అండర్-19 టీ20 వరల్డ్‌కప్‌లో మెరిసిన పలువురికి మెగా టోర్నీకి తీసుకోవడం విశేషం.
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ గ్లోబల్ క్వాలిఫయర్‌లో సూపర్ సిక్స్ చేరడం ద్వారా రెండోసారి టోర్నీకి అర్హత సాధించింది స్కాట్లాండ్. ఈ మెగా ఈవెంట్లో సత్తా చాటాలనే ఉద్దేశంతో సీనియర్లు, జూనియర్లకు ప్రాధాన్యమిచ్చారు సెలెక్టర్లు. ముఖ్యంగా 2018లో ఇంగ్లండ్‌కు ఆడిన కిర్స్టీ గోర్డన్ ఈసారి సొంతదేశం జెర్సీతో మెగా టోర్నీలో పాల్గొననుంది. 2017 తర్వాత కిర్స్టిన్ స్కాట్లాండ్కు ఆడడం ఇదే తొలిసారి. అలానే.. నిరుడు అండర్-19 టీ20 వరల్డ్‌కప్‌లో రాణించిన బౌలర్ గాబ్రియెల్లా ఫొంటెన్లా, వికెట్ కీపర్ బ్యాటర్ పిప్పా స్ప్రౌల్, అన్క్యాప్డ్ బౌలర్ మైసీ మసీరాలు తొలిసారి సీనియర్ టీమ్‌కు ఎంపికయ్యారు.
JUST IN: Scotland have named their squad for the Women’s T20 World Cup 🏴
Kirstie Gordon, who represented England at the 2018 tournament, will play for her country of birth for the first time since 2017 pic.twitter.com/yAiAvo68R5
— ESPNcricinfo (@ESPNcricinfo) May 11, 2026
‘ప్రపంచకప్ కోసం పదిహేను మందిని ఎంపిక చేయడం చాలా కష్టంగా అనిపించింది. చాలామంది ప్రతిభావంతులు ఉండడమే అందుకు కారణం. గతకొన్నేళ్లుగా స్కాట్లాండ్లో మహిళల క్రికెట్‌కు పెరుగుతున్న ఆదరణకు ఇది నిదర్శనం. మెగా టోర్నీ కోసం అన్ని విభాగాల్లో సమతూకంతో కూడిన బృందాన్ని ఎంపిక చేశాం. ఈ స్క్వాడ్ కచ్చితంగా ప్రపంచకప్‌లో విజయవంతం అవుతుదనే నమ్మకముంది. స్క్వాడ్‌లో కిర్స్టీ గోర్డన్ వంటి ప్రపంచస్థాయి క్రికెటర్లు ఉన్నారు.

గోర్డన్ రాకను మేము స్వాగతిస్తున్నాం. స్కాట్లాండ్ క్రికెట్ ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఆమె తోడ్పడుతుందనే నమ్మకముంది. ఆమెతో కలిసి పనిచేసేందుకు.. తన నైపుణ్యాలను మరింత సానబెట్టేందుకు ఎదురు చూస్తున్నా’ అని వల్లసీ పేర్కొంది. ప్రపంచకప్ కంటే ముందు బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్లతో ముక్కోణపు సిరీస్ ఆడనుంది.
స్కాట్లాండ్ వరల్డ్‌కప్ స్క్వాడ్ : క్యాథరీన్ బ్రౌసీ(కెప్టెన్), చోలె అబెల్, ఒలివియా బెల్, సారాయ్ బ్రైసీ, డార్సీ కార్టర్, ప్రియాంజ్ ఛటర్జీ, గాబ్రియెల్లా ఫొంటెన్లా, క్యాథరిన్ ఫ్రేజర్, కిర్స్టీ గోర్డన్, ఐల్సా లిస్టర్, మైసీ మసేరియా, అబతాహ మక్సూద్, మేగన్ మెక్కొల్ , రాచెల్ స్లేటర్, పిప్పా స్ప్రౌల్.
ఇంగ్లండ్ వేదికగా జూన్ 12 నుంచి పొట్టిప్రపంచకప్ మొదలవ్వనుంది. గ్రూప్ దశలో స్కాట్లాండ్ ఐదు మ్యాచ్‌లు ఆడనుంది. జూన్13న ఐర్లాండ్‌తో, 18న వెస్టిండీస్, 20వ తేదీన ఇంగ్లండ్, 23న న్యూజిలాండ్‌తో.. 26న శ్రీలంకతో తలపడనుంది.