Satwiksairaj | కొరియా ఓపెన్‌లో సాత్విక్ సంచలనం.. అత్యంత వేగవంతమైన స్మాష్‌తో గిన్నిస్ వరల్డ్ రికార్డు
Satwiksairaj : కొరియా ఓపెన్(Korea Open)లో భారత డబుల్స్ స్టార్ సాత్విక్‌సాయిరాజ్ (Satwiksairaj) సంచలనం సృష్టించాడు. అత్యంత వేగవంతమైన స్మాష్(Fastest Badminton Shot)తో గిన్నిస్ వరల్డ్ రికార్డు(Guinness world record)ల్లోకి ఎక్కాడు. సాత్విక్ గంటకు 565 కిలోమీటర్ల వేగంతో...
Satwiksairaj : కొరియా ఓపెన్(Korea Open)లో భారత డబుల్స్ స్టార్ సాత్విక్‌సాయిరాజ్ (Satwiksairaj) సంచలనం సృష్టించాడు. అత్యంత వేగవంతమైన స్మాష్(Fastest Badminton Shot)తో గిన్నిస్ వరల్డ్ రికార్డు(Guinness world record)ల్లోకి ఎక్కాడు. సాత్విక్ గంటకు 565 కిలోమీటర్ల వేగంతో స్మాష్‌ను కొట్టాడు. దాంతో, పురుషుల బాడ్మింటన్‌లో కాక్‌ను బలంగా కొట్టిన ఆటగాడిగా గుర్తింపు సాధించాడు.
స్మాష్ వేగాన్నిలెక్కించిన గిన్నిస్ రికార్డు ప్రతినిధిలు సాత్విక్ పేరును తమ పుస్తకంలో రాసుకున్నారు. భారత స్టార్ దెబ్బకు పదేళ్ల రికార్డు బద్ధలైంది. మలేషియా ఆటగాడు టాన్ బూన్ హీంగ్(Tan Boon Heong) 2013లో గంటకు 493 కిలోమీటర్ల వేగంతో స్మాష్ ఆడాడు.
ప్రీ-క్వార్టర్స్‌లో
ఈ మ్యాచ్‌లో సాత్విక్ – చిరాగ్ జోడీ సుపాక్ జొమ్కొహ్, కిట్టినుపాంగ్ కెడ్రెన్పై 21-16, 21-14తో గెలుపొందింది. ఆద్యంతం ఆధిపత్యం చెలాయించిన భారత జోడీ 32 నిమిషాల్లోనే మ్యాచ్ ముగించింది. ఈ విజయంతో సాత్విక్ – చిరాగ్ ద్వయం ప్రీ-క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ఈ సీజన్లో వీళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు.
ఇండోనేషియా ఓపెన్ టైటిల్‌తో సాత్విక్ – చిరాగ్

ఈమధ్యే ఇండోనేషియా ఓపెన్(Indonasia Open) చాంపియన్‌గా నిలిచారు. టోర్నీ ఆరంభం నుంచి అదరగొట్టిన వీళ్లు టాప్ సీడ్లకు షాకిస్తూ.. తొలిసారి ఇండోనేషియా ఓపెన్ టైటిల్ సాధించారు. గత కొంత కాలంగా నిలకడగా రాణిస్తున్న సాత్విక్ – చిరాగ్ డబుల్స్‌లో ఆరో ర్యాంక్ సొంతం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
Ajit Agarkar | వెస్టిండీస్‌కు చీఫ్ సెలెక్టర్ అగార్కర్.. వరల్డ్ కప్ జట్టుపై చర్చల కోసమేనా..?
Novak Djokovic | ఓటమి బాధలో ఉన్న జకోవిచ్‌కు మరో షాక్.. భారీ ఫైన్ పడింది
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

