BWF Championships | క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ జోడీ ఓటమి.. మూడో మెడల్ ఆశలు ఆవిరి..!
BWF Championships : బీడబ్ల్యూఎఫ్ ఛాంపియన్షిప్స్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి పోరాటం ముగిసింది. కచ్చితంగా పతకం గెలుస్తారనుకున్న ఈ ద్వయం క్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించింది.
BWF Championships : బీడబ్ల్యూఎఫ్ ఛాంపియన్షిప్స్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి పోరాటం ముగిసింది. కచ్చితంగా పతకం గెలుస్తారనుకున్న ఈ ద్వయం క్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో వరల్డ్ నంబర్ 3 లియాంగ్ వీ కెంగ్ – వాంగ్ చాంగ్ ధాటికి భారత జోడీ చేతులెత్తేసింది. దాంతో, మూడోసారి ఈ టోర్నమెంట్లో పతకంతో మురవాలనుకున్న సాత్విక్ – చిరాగ్ ఆశలు ఆవిరయ్యాయి.
నెదర్లాండ్స్ వేదికగా జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ఛాంపియన్‌షిప్స్‌లో శుక్రవారం భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపిచంద్ – త్రిసా జాలీ ద్వయం క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లగా.. పురుషుల జంట మాత్రం నిరాశపరిచింది.
It wasn’t meant to be 💔
A visibly disappointed Satwik – Chirag thanked the home crowd for their support and applauded Liang-Wang on their win!
Wishing SatChi to comeback stronger next time 🤗#bwfworldchampionships #newdelhi2026 pic.twitter.com/ipr6Z59HZ9
— BAI Media (@BAI_Media) August 21, 2026
ఈ ఛాంపియన్‌షిప్స్‌లో ఇది వరకు రెండుసార్లు మెడల్ కొల్లగొట్టిన సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి జోడీ క్వార్టర్స్ దాటలేదు. మూడో సీడ్ లియాంగ్ వీ కెంగ్ – వాంగ్ చాంగ్తో పోరులో తేలిపోయిన భారత జంట 18-21, 9-21తో చిత్తుగా ఓడింది. తొలి సెట్లో కాస్త పోరాడినా.. రెండో సెట్లో ప్రత్యర్థికి బదులివ్వలేక మ్యాచ్‌ను అప్పగించేసింది సాత్విక్ చిరాగ్ ద్వయం. 2022, 2025లో చెలరేగి ఆడిన ఈ జోడీ కాంస్యం గెలుపొందిన విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MP Vaddiraju Ravichandra | ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే తప్పుకోవాలి : ఎంపీ వద్ది రాజు రవిచంద్ర
JNU professor | జేఎన్‌యూలో లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రొఫెసర్‌ను డిస్మిస్ చేసిన యూనివర్సిటీ
SA vs AUS | నిప్పులు చెరుగుతున్న సఫారీలు.. పీకల్లోతు కష్టాల్లో వరల్డ్ నంబర్ 1..!
‘బీఈడీ కళాశాలల్లో ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ తప్పనిసరి’
చెరువు అలుగు నీటిని మళ్లించొద్దు… పైప్‌లైన్ అనుమతిని రద్దు చేయాలి
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

