Sanjay Manjrekar | వరల్డ్ కప్‌లో సూర్యను లోయర్ ఆర్డర్లో ఆడించాలి.. ఎందుకంటే..? : మంజ్రేకర్
Sanjay Manjrekar : భారత స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్(Surya Kumar Yadav) అనగానే విధ్వంసక ఇన్నింగ్స్‌లే గుర్తుకొస్తాయి. పొట్టి క్రికెట్(T20 Cricket)లో ప్రకంపనలు సృష్టించిన అతను 16వ సీజన్ ఐపీఎల్‌లోనూ ఇరగదీశాడు. స్కూప్ షాట్లతో అలవోకగా సిక్సర్లు బాదే సూర్య వన్డే వరల్డ్ కప్(ODI WC 2023)లో కీలకం కానున్నాడు. అయితే.. అతడిని ఏ స్థానంలో ఆడిస్తారు? అనేది తెలియదు. సూర్యను లోయర్ ఆర్డర్లో ఆడించాలని....
Sanjay Manjrekar : భారత స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్(Surya Kumar Yadav) అనగానే విధ్వంసక ఇన్నింగ్స్‌లే గుర్తుకొస్తాయి. పొట్టి క్రికెట్(T20 Cricket)లో ప్రకంపనలు సృష్టించిన అతను 16వ సీజన్ ఐపీఎల్‌లోనూ ఇరగదీశాడు. స్కూప్ షాట్లతో అలవోకగా సిక్సర్లు బాదే సూర్య వన్డే వరల్డ్ కప్(ODI WC 2023)లో కీలకం కానున్నాడు. అయితే.. అతడిని ఏ స్థానంలో ఆడిస్తారు? అనేది తెలియదు. అయితే.. సూర్యను లోయర్ ఆర్డర్లో ఆడించాలని కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్(Sanjay Manjrekar) అభిప్రాయపడ్డాడు.
‘సూర్యలాంటి విధ్వంసక ఆటగాడు లోయర్ ఆర్డర్లో ఆడాలి. కానీ, వన్డేల్లో సూర్య ఎందుకు పరుగులు సాధించడం లేదో నాకు అర్ధం కావడం లేదు. అతడికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలి. అప్పుడే అతను లయ అందుకుంటాడు’ అని మంజ్రేకర్ తెలిపాడు. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్‌కు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. అక్టోబర్ 5న పోటీలు మొదలవ్వనున్నాయి.
ఆసీస్‌పై హ్యాట్రిక్ డక్స్
టీ20 ఫార్మాట్ అంటే చాలు సూర్య రెచ్చిపోయి ఆడతాడు. బౌలర్ ఎవరైనా సరే బంతిని స్టాండ్స్‌లోకి పంపుతాడు. అలాంటిది అతను ఎందుకనో వన్డేల్లో మాత్రం బ్యాట్ ఝులిపించలేకపోతున్నాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్‌లో హ్యాట్రిక్ డక్స్(Hattrick Ducks)తో చెత్త రికార్డు మూటగట్టుగున్నాడు. దాంతో, అతను ఫామ్ కోల్పోయాడని అనుకున్నారంతా.
ఆస్ట్రేలియాపై హ్యాట్రిక్ డకౌట్ అయిన సూర్య

కానీ, ఆ తర్వాత మొదలైన ఐపీఎల్ 16వ సీజన్లో సూర్య చితక్కొట్టాడు. ముంబై ఇండియన్స్(Mumbai Indians) తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతేకాదు ఈ సీజన్లో అతను తొలి ఐపీఎల్ సెంచరీ నమోదు చేశాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న అతడు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్(WTC Final 2023)కు స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. కానీ… ఫైనల్లో ఆడే అవకాశం మాత్రం రాలేదు. త్వరలో జరగబోయే విండీస్ టూర్‌కు వెళ్లనుంది. రెండు టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. వన్డేలు, టీ20ల్లో దంచి కొట్టాలని ఈ విధ్వంసక ఆటగాడు ఉవ్విళ్లూరుతున్నాడు.
ఇవి కూడా చదవండి
HS Prannoy | తైపీ ఓపెన్‌లో ముగిసిన ప్రణయ్ పోరాటం
TeamIndia | భారత జట్టు ఐసీసీ ట్రోఫీ గెలిచి ఈ రోజుకి పదేళ్లు.. అదీ ధోనీ కెప్టెన్సీలోనే
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

