న్యూఢిల్లీ: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా(Sania Mirza) ఇటీవల తన భర్త షోయెబ్ అక్తర్‌కు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక భారత క్రికెటర్ మహమ్మద్ షమీ కూడా తన భార్యకు దూరంగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో.. సానియా, షమీ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వ్యాపించాయి. ఆన్లైన్లో ఆ పుకార్లు షికారు చేస్తున్నాయి. ఆ పెళ్లి వార్తలపై సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా స్పందించారు. అవన్నీ చెత్త వార్తలని, ఇప్పటి వరకు షమీని సానియా కలవలేదని ఇమ్రాన్ మీర్జా ఓ ఆంగ్ల మీడియాతో పేర్కొన్నారు.
సానియా మీర్జా హజ్ యాత్రకు వెళ్లింది. ఇటీవలే ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి కూడా రిటైర్ అయిన ఆమె.. తన సోషల్ మీడియా పోస్టులో ఆసక్తికర అంశాన్ని తెలిపారు. తాను మారుతున్నట్లు చెప్పిన ఆమె.. ఏవైనా తప్పులు ఉంటే క్షమించాలని ఆమె దేవున్ని ప్రార్థించారు. తన ప్రార్థనలను అల్లా ఆలకిస్తాడని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. తాను అదృష్టవంతురాలిని అని, కృతజ్ఞతో ఉంటానని, పవిత్ర యాత్ర చేపడుతున్న సందర్భంగా తనను గుర్తుంచుకోవాలని, ఒక మంచి మనిషిలా తాను తిరిగి వస్తానని ఆశిస్తున్నట్లు సానియా తన పోస్టులో తెలిపారు.