Sam Curran | ఇంగ్లండ్ ఆల్‌రౌండర్‌కు గాయం.. వేసవి మ్యాచ్‌లన్నిటికీ దూరం..!
Sam Curran : స్వదేశంలో వేసవి మ్యాచ్‌లకు పక్కాగా సిద్ధమవ్వాలనుకున్న ఇంగ్లండ్‌కు షాక్ తగిలింది. బెన్ స్టోక్స్ వారసుడిగా జట్టుకు కొండంత బలం అవ్వాల్సిన సామ్ కరన్(Sam Curran) మళ్లీ గాయపడ్డాడు.
Sam Curran : స్వదేశంలో వేసవి మ్యాచ్‌లకు పక్కాగా సిద్ధమవ్వాలనుకున్న ఇంగ్లండ్‌కు షాక్ తగిలింది. బెన్ స్టోక్స్ వారసుడిగా జట్టుకు కొండంత బలం అవ్వాల్సిన సామ్ కరన్(Sam Curran) మళ్లీ గాయపడ్డాడు. ఈసారి గాయం తీవ్రత కారణంగా సర్జరీ అనివార్యమైనందున.. వచ్చే ఏడాది వేసవిలో జరిగే అన్ని మ్యాచ్‌లకు ఈ పేస్ ఆల్‌రౌండర్ దూరం కానున్నాడు. ఈ విషయాన్నిసర్రే క్రికెట్ ధ్రువీకరించింది. గజ్జల్లో గాయంతో సమ్మర్ సీజన్ మొత్తానికి కరన్ అందుబాటులో ఉండడని సర్రే వెల్లడించింది.
ఈమధ్య తరచూ గాయపడుతున్న సామ్ కరన్ మళ్లీ జట్టుకు దూరమయ్యాడు. పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికవ్వని ఈ పేస్ ఆల్‌రౌండర్ వచ్చే ఏడాది వేసవిలో ఇంగ్లండ్ మ్యాచ్‌లకూ అందుబాటులో ఉండడం లేదు. గజ్జల్లో గాయం కారణంగా.. అతడికి సర్జరీ చేయాల్సి ఉందని సర్రే క్రికెట్ పేర్కొంది.
Update: Sam Curran will miss the rest of England’s home fixtures this season due to a groin injury, while Will Jacks is recovering having had a successful operation to remove his appendix pic.twitter.com/wlozOAvX7l
— Cricinfo (@cricinfo) August 20, 2026
‘సామ్ మాకు కీలకమైన ఆటగాడు. భవిష్యత్‌లో ఆల్‌రౌండర్‌గా అతడి సేవలు అందించనున్నాడు. అందుకని అతని మా వైద్యబృందం పరీక్షిస్తోంది. అతడికి ఆగస్టు 21 శుక్రవారం సర్జరీ ఉంది అని సర్రే వెల్లడించింది. అయితే.. గజ్జల్లో గాయం అంటూ ఐపీఎల్ 19వ సీజన్‌కు దూరమైన సామ్ కరన్.. ది హండ్రెడ్ లీగ్‌లో ఆడడంపై రాజస్థాన్ రాయల్స్ కోచ్ కుమార సంగక్కర మండిపడిన విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

