ముంబై : బాలీవుడ్ అగ్రనటుడు సల్మాన్ ఖాన్ క్రికెట్ టీమ్‌కు ఓనర్ అయ్యాడు. గత రెండు సీజన్లుగా దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను అలరిస్తున్న ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్పీఎల్)లో సల్లూ భాయ్.. ఢిల్లీ ఫ్రాంచైజీని దక్కించుకున్నాడు.
టెన్నిస్ బాల్‌తో ఆడే ఈ టోర్నీలో ఇదివరకే అమితాబ్ బచ్చన్ (ముంబై), సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ (కోల్‌కతా), అక్షయ్ కుమార్ (శ్రీనగర్), హృతిక్ రోషన్ (బెంగళూరు), రామ్‌చరణ్ (హైదరాబాద్), సూర్య (చెన్నై) వంటి సెలబ్రిటీలు ఫ్రాంచైజీలను కలిగిఉండగా తాజాగా ఈ జాబితాలో సల్మాన్ చేరాడు. సల్మాన్ ఈ టోర్నీలో భాగస్వామి అయ్యాడని ఐఎస్పీఎల్ కమిషనర్ సూరజ్ సమత్ ధృవీకరించాడు. త్వరలోనే అహ్మదబాద్ ఫ్రాంచైజీ ఓనర్ వివరాలు వెల్లడిస్తామని ఆయన అన్నారు.