Saina Nehwal | హైదరాబాద్: సహచర షట్లర్ పారుపల్లి కశ్యప్‌తో విడాకులపై భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ స్పష్టతనిచ్చింది. పరస్పర అంగీకారంతోనే తాము ఇద్దరం విడిపోయినట్లు సైనా పేర్కొంది. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ తమ వివాహ బంధానికి వీడ్కోలు పలుకుతున్నట్లు సైనా ఈ మధ్యే సోషల్‌మీడియా వేదికగా ప్రకటించడం సంచలనం కల్గించింది. 2018లో వివాహబంధంతో ఒక్కటైన వీరు ఏడేండ్ల వ్యవధిలో విడాకులతో విడిపోయారు.
దీనిపై సైనా స్పందిస్తూ ‘జీవితం ఒక్కోసారి ఒక్కో మార్గంలో తీసుకెళుతుంది. సుదీర్ఘమైన ఆలోచనలు, అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకుంటూ కశ్యప్, నేను విడిపోయేందుకు సిద్ధమయ్యాం. మేము ఒకరికొకరం ప్రశాంతత, ఎదుగుదల కోరుకుంటున్నాం. ఇన్ని రోజుల జ్ఞాపకాలు మరిచిపోలేనివి, కానీ జీవితంలో ముందుకు సాగాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవు. ఈ క్లిష్టమైన సమయంలో మా ప్రైవసీని అర్థం చేసుకుంటున్నందుకు ధన్యవాదాలు’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది.