హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీలో తెలంగాణ యువ ప్లేయర్ గంటా సాయి కార్తీక్ రెడ్డి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. షామీర్పేట్ వేదికగా జరుగుతున్న టోర్నీ పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో సాయి కార్తీక్ 6-3, 6-4తో తుషార్‌పై గెలిచాడు. అంతకుముందు క్వార్టర్స్‌లో 6-4, 6-4తో ఆదిత్యపై నెగ్గాడు.