హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ యువ టెన్నిస్ ప్లేయర్ సహజ యమలపల్లి కెరీర్లో మూడో టైటిల్ కైవసం చేసుకుంది. ఐటీఎఫ్ -25 కే టోర్నీలో సహజ విజేతగా నిలిచింది. ఆదివారం సోలాపూర్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో సహజ 6-4, 6-3తో రెండో సీడ్ ఎకతెరినా మకరోవా (రష్యా)పై విజయం సాధించింది.
టోర్నీలో ఏడో సీడ్‌గా బరిలోకి దిగిన సహజ.. ఒక్క సెట్ కూడా కోల్పోకుండా.. టైటిల్ చేజిక్కించుకోవడం గమనార్హం. తుదిపోరులో తనకంటే మెరుగైన ప్రత్యర్థితో తలపడ్డ సహజ.. వరుస పాయింట్లతో విజృంభించింది. అంతకుముందు సెమీస్‌లో సాకి ఇమామురా (జపాన్)పై, క్వార్టర్స్‌లో హిరోమి అబే (జపాన్)పై ప్రిక్వార్టర్స్‌లో మధురిమ (భారత్)పై విజయాలు సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది.