Sachin Tendulkar | నిన్ను ఎంతో మిస్ అవుతున్నా.. లెజెండరీ స్పిన్నర్‌ను యాది చేసుకున్న సచిన్
భారత జట్టు మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన చిరకాల ప్రత్యర్ధిని గుర్తు చేసుకున్నాడు. ఆస్ట్రేలియా దివంగత లెజెండరీ స్పిన్నర్షేన్ వార్న్ ప్రథమ వర్ధంతి సందర్భంగా అతనితో దిగిన ఒకప్పటి ఫొటోను ఆన్లైన్లో షేర్ చేశాడు. అతనితో తనకున్న అనుబంధం గురించి వివరించాడు. గత ఏడాది థాయ్‌లాండ్ పర్యటనలో ఉన్న ఈ మిస్టరీ స్పిన్నర్ మార్చి 4న గుండెపోటుతో మరణించాడు.
Sachin Tendulkar : భారత జట్టు మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన చిరకాల ప్రత్యర్ధిని గుర్తు చేసుకున్నాడు. ఆస్ట్రేలియా దివంగత లెజెండరీ స్పిన్నర్షేన్ వార్న్ ప్రథమ వర్ధంతి సందర్భంగా అతనితో దిగిన ఒకప్పటి ఫొటోను ఆన్లైన్లో షేర్ చేశాడు. అతనితో తనకున్న అనుబంధం గురించి వివరించాడు. ‘మేము మైదానంలో ఎన్నో గొప్ప మ్యాచ్‌లు ఆడాం. ఇద్దరంం ఎన్నో అపురూపమైన జ్ఞాపకాలు వెనకేసుకున్నాం.
ఒక గొప్ప క్రికెటర్‌గానే కాదు ఒక గొప్ప స్నేహితుడిగా నిన్న ఎంతో మిస్ అవుతున్నా. అయితే.. నీ హాస్య చతురత, వాక్చాతుర్యంతో స్వర్గాన్ని మరింత ఆహ్లాదరకరమైన ప్రాంతంగా మార్చావని అనుకుంటున్నా’ అని ఆ ఫొటోలకు క్యాప్షన్ రాసుకొచ్చాడు.
బయట మంచి స్నేహితులు
ఆస్ట్రేలియా, భారత్ జట్లు ఎప్పుడు తలపడినా కూడా షేన్ వార్న్, సచిన్ మధ్య పోరాటం ఆసక్తికరంగా ఉండేది. అయితే.. మైదానంలో ప్రత్యర్థులైన వీళ్లు బయట మంచి స్నేహితులుగా ఉండేవాళ్లు. అంతు చిక్కని బౌలింగ్‌తో బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టే వార్న్‌ను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ధాటిగా ఎదుర్కొన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఈ లెగ్ స్పిన్నర్‌ను ఒక ఆటాడుకున్నాడు. దాంతో, సచిన్ తనకు నిద్ర లేని రాత్రులు మిగిల్చాడని గతంలో షేన్ వార్న్ వెల్లడించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్లో రికార్డులు బద్ధలు కొట్టిన వార్న్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ ఆడాడు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా ఆ జట్టు తొలి సీజన్లోనే ఛాంపియన్‌గా అవతరించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత కామెంటేటర్‌గా కొనసాగాడు.
థాయ్‌లాండ్‌లో గుండెపోటుతో..
ఆటతో ఆకాశమంత ఎత్తు ఎదిగిన వార్న్ ఆస్ట్రేలియా క్రికెట్లో చెరగని ముద్ర వేశాడు. మైదానంలో సక్సెస్ అయిన అతని జీవితంలో చీకటి రోజులు కూడా ఉన్నాయి. అమ్మాయిలతో వ్యవహారం నడపడం, డ్రగ్స్ తీసుకోవడం వంటివి అతనికి చెడ్డ పేరు తెచ్చాయి. గత ఏడాది థాయ్‌లాండ్ పర్యటనలో ఉన్న ఈ మిస్టరీ స్పిన్నర్ మార్చి 4న అనుకోకుండా గుండెపోటుతో మరణించాడు. అతను తన గదిలో పడిపోవడం గమనించిన సిబ్బంది సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడాలని ప్రయత్నించారు. అప్పటికే వార్న్ కన్నుమూశాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు (708) తీసిన రెండో బౌలర్‌గా గుర్తింపు సాధించాడు. శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ 800 వికెట్లతో మొదటి స్థానంలో ఉన్నాడు.
We have had some memorable battles on the field & shared equally memorable moments off it. I miss you not only as a great cricketer but also as a great friend. I am sure you are making heaven a more charming place than it ever was with your sense of humour and charisma, Warnie! pic.twitter.com/j0TQnVS97r
— Sachin Tendulkar (@sachin_rt) March 4, 2023
ఇవి కూడా చదవండి
Mohammed Shami | మార్చి 9 నుంచి ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు.. తుది జట్టులో మహ్మద్ షమీకి చోటు..!
Yashasvi Jaiswal | ఇరానీ కప్‌లో ఒకే ఒక్కడు.. ఒకే మ్యాచ్‌లో డబుల్ సెంచరీ, శతకం బాదిన యశస్వీ
Galwan Valley: గాల్వాన్ వ్యాలీలో క్రికెట్ ఆడుతున్న ఇండియన్ ఆర్మీ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘రణబాలి’.. 24 గంటల్లోనే 1.39 లక్షల టికెట్ల విక్రయం!
Cricketer Jehangir | అభిమానిని కిందపడేసి చితకబాదిన క్రికెటర్.. వీడియో వైరల్!
MBBS Student | హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని.. మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య
Jailer 2 | రజినీకాంత్ ‘జైలర్ 2’ సునామీ.. 5 రోజుల్లోనే రూ. 500 కోట్ల వసూళ్లు!
Dasara Posters | టాలీవుడ్లో పండగ జోష్.. దసరా కానుకగా సందడి చేసిన కొత్త సినిమాల పోస్టర్లు చూశారా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

