Jersey no 10 | పదో నంబర్ జెర్సీ ఎందుకంత ప్రత్యేకం? సచిన్, పీలే, మెస్సీ దిగ్గజ క్రీడాకారులు ఈ జెర్సీ ధరించినవాళ్లే
Jersey no 10 | రెండంకెల సంఖ్యల్లో అత్యంత చిన్నది 10. కానీ, చదువులో పది రేటింగ్ సాధిస్తే టాప్ స్టూడెంట్. పాటల్లో పది మార్కులు కొల్లగొడితే టాప్ సింగర్. ఆటలో పది పాయింట్లకు గురిపెడితే రికార్డు! అదే పది సంఖ్య జెర్సీ మీదికి ఎక్కితే? దానిని ధరించిన ఆటగాడు టాప్ ప్లేయర్‌గా నిలిచిపోతాడు.
Jersey no 10 | రెండంకెల సంఖ్యల్లో అత్యంత చిన్నది 10. కానీ, చదువులో పది రేటింగ్ సాధిస్తే టాప్ స్టూడెంట్. పాటల్లో పది మార్కులు కొల్లగొడితే టాప్ సింగర్. ఆటలో పది పాయింట్లకు గురిపెడితే రికార్డు! అదే పది సంఖ్య జెర్సీ మీదికి ఎక్కితే? దానిని ధరించిన ఆటగాడు టాప్ ప్లేయర్‌గా నిలిచిపోతాడు. ఆ సంఖ్య గొప్పదనమో, దానిని ధరించిన ఆటగాడి ప్రతిభో తెలియదు కానీ, దస్ నంబర్ జెర్సీ ధరించిన ఆటగాళ్లలో చాలామంది ప్రపంచస్థాయి గుర్తింపు సాధించారు. ఫుట్‌బాల్ మాంత్రికుడు పీలే మొదలు క్రికెట్ దేవుడిగా ఖ్యాతి గడించిన సచిన్ టెండూల్కర్ వరకు దస్ నంబర్‌తో దునియాను శాసించినవాళ్లే.
1999 సంవత్సరం వరల్డ్‌కప్ సందర్భంగా క్రికెట్లో జెర్సీలపై నంబర్ల సంప్రదాయం మొదలైంది. ఆ సందర్భంగా కొందరు అచ్చొచ్చిన నంబర్లను తమ దుస్తులపై వేసుకున్నారు. ఇంకొందరు వేసుకోవాలి కాబట్టి ఏదో ఒక సంఖ్యను ఎంచుకున్నారు. తన పేరు ఉచ్చారణలో ‘టెన్’ ధ్వనిస్తుందనో, వేరే కారణమో తెలియదు కానీ.. సచిన్ టెండూల్కర్ జెర్సీపై నంబర్ టెన్ వచ్చి చేరింది. ఆయన వీపున ఎక్కిన క్షణంలో పది సంఖ్య సంబురం పదింత లైందేమో! ఆనాటి నుంచి సచిన్ ప్రతి షాట్‌కు పది వెన్నుదన్నుగా నిలిచింది. మధ్యలో కొంత కాలం జెర్సీ మీద 99, 33 సంఖ్యలు తైతక్కలాడినా.. సెంటిమెంట్ వర్కవుట్ కాకపోవడంతో మళ్లీ ‘పది’నే నమ్ముకున్నాడు మాస్టర్ బ్లాస్టర్. రిటైర్ అయ్యేవరకు ఆ నంబర్‌ను వదులుకోలేదు. జెర్సీపై నంబర్ టెన్ను అలంకరించుకున్న మేటి క్రికెటర్లు కొందరు ఉన్నారు. దక్షిణాఫ్రికా సూపర్ ఫాస్ట్ బౌలర్ అలెన్ డొనాల్డ్ జెర్సీ నంబర్ కూడా పదే.
పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది, ఆస్ట్రేలియా బౌలర్ పీటర్ సిడెల్, దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ 10 నంబర్ జెర్సీ ధరించినవాళ్లే. అందరి సంగతేమో కానీ, సచిన్, డొనాల్డ్ ఇద్దరూ దస్ నంబర్ దమ్ము చూపించారు.
ఫుట్‌బాల్‌లో ప్రత్యేకం..
ఫుట్‌బాల్ చరిత్రలో పది సంఖ్యకు మరింత ప్రాధాన్యం ఉంది. మైదానంలో ఆటగాడి స్థానాన్ని బట్టి నంబర్లు ఉంటాయి. అటాకింగ్ మిడ్ ఫీల్డర్‌ను పదో సంఖ్యతో సూచిస్తుంటారు. గోల్‌కీపర్ 1వ నంబర్, రైట్ బ్యాక్ పొజిషన్లో ఉండే ఆటగాడు 2, లెఫ్ట్ బ్యాక్ స్థానంలో ఉన్న ప్లేయర్ 3వ నంబర్ జెర్సీ ధరిస్తారు. మైదానంలో 11 మంది ఆటగాళ్లే బరిలోకి దిగినా.. ఫుట్‌బాల్ జట్టులో గరిష్ఠంగా 23 మంది క్రీడాకారులను ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంది. జెర్సీ నంబర్లు కూడా క్రమం తప్పకుండా వరుసగా ఉంటాయి. ఆ క్రమంలో అటాకింగ్ మిడ్ ఫీల్డర్ సంఖ్య పదిగా నిశ్చయమైంది. ఈ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు పదో నంబర్ జెర్సీ ధరిస్తాడు. ఈ లెక్కలకు అతీతంగా కొందరు తమకు అచ్చొచ్చిన నంబర్ల జెర్సీలనూ వేసుకుంటారు. అయితే, ఫుట్‌బాల్ చరిత్రలో ప్రపంచాన్ని ఉర్రూతలు ఊగించిన ఆటగాళ్లలో చాలామంది పదో నంబర్ జెర్సీ ధరించినవాళ్లే!
దిగ్గజాలంతా ‘పది’తోనే..
ఫుట్‌బాల్‌లో 20వ శతాబ్దపు మేటి ఆటగాడిగా ఎంపికైన పీలే జెర్సీ నంబర్ 10. బ్రెజిల్ తరఫున నాలుగు ప్రపంచకప్ పోటీల్లో పాల్గొన్న ఆయన, మూడుసార్లు కప్పు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇటీవల కన్నుమూసిన పీలే పుట్టింది క్యాలెండర్లో పదోనెల అయిన అక్టోబర్ కావడం కాకతాళీయమే! అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం డిగో మారడోనా జెర్సీ నంబరూ పదే! ఆయన పుట్టిందీ అక్టోబర్‌లోనే!! 1998లో ఫ్రాన్స్‌కు ఫీఫా ప్రపంచకప్ సాధించి పెట్టిన జిదానే కూడా దస్ నంబర్ జెర్సీ ఆటగాడే. మరో బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం రొనాల్డిన్హో జెర్సీపైనా 10 కనిపిస్తుంది. అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టు నాయకుడు మెస్సీ ధరించిందీ 10 నంబర్ జెర్సీనే! తమ విన్యాసాలతో సాకర్ ప్రేక్షకులను ఉర్రూతలూగించే నెయిమార్ (బ్రెజిల్), ఎంబాప్పే (రష్యా), హారికేన్ (ఇంగ్లాడ్) కూడా 10 నంబర్ జెర్సీ ఆటగాళ్లే! ఏదేతైనేం.. ఆటే ప్రాణంగా భావించే లబ్ధప్రతిష్ఠులైన ఆటగాళ్ల సరసన చేరి పది సంఖ్య గర్వంగా భావిస్తుంటుందేమో!!
Read More :
“Suresh Raina | టాలెంట్ మాత్రమే సరిపోదు.. తన సక్సెస్ సీక్రెట్ ఏంటో రివీల్ చేసిన సురేశ్ రైనా”
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Jersey
- Messi
- Pele
- Sachin Tendulkar
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

