Wimbledon | టోర్నీకి దూరమైన సబలెంక.. కారణమిదే..?
Wimbledon : వరల్డ్ మూడో నంబర్ అరినా సబలెంక(Aryna Sabalenka) ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ టోర్నీ నుంచి వైదొలిగింది. భుజం గాయం కారణంగా టోర్నీలో పాల్గొనడం లేదని సోమవారం బెలారస్ భామ చెప్పింది
Wimbledon : వరల్డ్ మూడో నంబర్ అరినా సబలెంక(Aryna Sabalenka) ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ టోర్నీ నుంచి వైదొలిగింది. తొలి మ్యాచ్‌లో అమెరికా అమ్మాయి ఎమినా బెక్తాస్తో సబలెంక తలపడాల్సింది. కానీ, భుజం గాయం కారణంగా టోర్నీలో పాల్గొనడం లేదని సోమవారం బెలారస్ భామ చెప్పింది. దాంతో, ఆమె స్థానంలో ఎరికా అండ్రీవా వింబుల్డన్ ఆడనుంది. మెగా టోర్నీ నుంచి ముందుగానే తప్పుకోవడంతో తన గుండె పగిలినంత బాధ ఉందని సంబలెంక అంది.
‘విశ్రాంతి లేకుండా వింబుల్డన్‌కు వెళ్లితే గాయం మరింత తీవ్రమయ్యే అవకాశముందని వైద్య బృందం సూచింది. దాంతో, ఈ కఠిన నిర్ణయానికి వచ్చాన’ని సబలెంక వెల్లడించింది. టాప్ సీడ్లలో ఒకరైన సబలెంక గైర్హాజరీలో ఇగా స్వియాటెక్, కొకొ గాఫ్, ఎలీనా రాడుకానులలో ఒకరు చాంపియన్ అయ్యే చాన్స్ ఉంది.

‘నేను వంద శాతం ఫిట్నెస్తో లేను. ఈ ఏడాది వింబుల్డన్ ఆడట్లేదనే విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు బాధగా ఉంది. నేను ఎంతో ప్రయత్నించాను. ఈ టోర్నమెంట్ కోసం రోజంతా సాధన చేశా. కానీ, నా భుజం సహకరించడం లేదు. వింబుల్డన్ నాకు ఎంతో ముఖ్యమైనది. అయితే.. వచ్చే ఏడాది నేను మరింత బలంగా తిరిగొస్తానని మీకు ప్రామిస్ చేస్తున్నా’ అని సబలెంక తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది.
ఘనంగా ఆరంభించి..
ఈ ఏడాదిని సబలెంక ఆస్ట్రేలియన్ ఓపెన్ ట్రోఫీతో ఘనంగా ఆరంభించింది. ఆ తర్వాత మాడ్రిడ్, రోమ్ ఓపెన్‌లో నంబర్ 1 ఇగా స్వియాటెక్ చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అనంతరం.. ఫ్రెంచ్ ఓపెన్‌లో 17 ఏండ్ల మిర్రా అండ్రీవా ధాటికి సబలెంక తలొంచింది. యూఎస్ ఓపెన్‌లోనూ బెలారస్ స్టార్‌కు అమెరికా టీనేజర్ కొకో గాఫ్ చెక్ పెట్టింది.
ఇవి కూడా చదవండి
- Amit Shah | హిందువులను అవమానించిన రాహుల్ క్షమాపణ చెప్పాలి : అమిత్ షా
- Kangana Ranaut | రాహుల్‌గాంధీ మాంచి స్టాండప్ కమెడియన్ : బీజేపీ ఎంపీ కంగనా రనౌత్
- Laura Wolvaardt | మూడు ఫార్మాట్లలో ‘సెంచరీ’.. చరిత్ర సృష్టించిన సఫారీ కెప్టెన్
- Cabinet Expansion | త్వరలో మంత్రివర్గ విస్తరణ.. సీతక్కకు హోమంత్రి ఇచ్చే అవకాశం : మంత్రి దామోదర
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhargav Desh Pande | రేవంత్ రెడ్డి చుట్టున్న నలుగురు తప్ప ఎవరూ బాగుపడలేదు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
KAAKA | చిరంజీవి ‘కాకా’లో బాలీవుడ్ స్టార్ హీరో .. కీలక పాత్రపై ఆసక్తికర చర్చ!
Mann Ki Baat | ‘మన్ కీ బాత్’ కు 12 ఏళ్లు పూర్తి.. అదొక తీర్థయాత్ర లాంటిదన్న ప్రధాని మోదీ..!
Alias Rukmini | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్!
Rapido Driver | కానిస్టేబుల్ చెవిని కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

