మియామి (యూఎస్ఏ) : టాప్ సీడ్ అరీనా సబలెంకా ఖాతాలో మరో ఘనత. ఇటీవలే ఇండియన్ వెల్స్ గెలిచిన ఈ బెలారస్ బామ.. తాజాగా ఆదివారం ముగిసిన మియామి ఓపెన్‌లోనూ మహిళల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకుని ‘సన్‌షైన్ డబుల్’ సాధించింది. ఫైనల్లో సబలెంకా.. 6-2, 4-6, 6-3తో నాలుగో సీడ్ కోకో గాఫ్ (యూఎస్ఏ)ను చిత్తుచేసింది.
టెన్నిస్‌లో గ్రాండ్‌స్లామ్ ఈవెంట్స్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ టోర్నీల (ఇండియానా వెల్స్, మియామి ఓపెన్)ను ఒకే సీజన్లో గెలిచిన ప్లేయర్లకు సన్‌షైన్ డబుల్ గెలిచిన ఆటగాళ్లుగా గుర్తింపు దక్కుతుంది. 2022లో పోలండ్ అమ్మాయి ఇగా స్వియాటెక్ తర్వాత ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్ (మొత్తంగా ఐదో) క్రీడాకారిణీగా రికార్డులకెక్కింది.