లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్‌లో టాప్ సీడ్ అరీనా సబలెంకా సెమీస్‌కు ప్రవేశించింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్ పోరులో సబలెంకా.. 4-6, 6-2, 6-4తో లారా సీగ్మండ్ (జర్మనీ)ని ఓడించింది. సబలెంకాకు ఇది ఈ టోర్నీలో మూడో సెమీస్. మరో క్వార్టర్స్‌లో అమంద (యూఎస్).. 6-1, 7-6 (11/9), పవ్లియుచెంకొవను మట్టికరిపించింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో ఐదో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (యూఎస్).. 6-3, 6-4, 1-6, 7-6 (7/4) కరెన్ ఖచనో (రష్యా)పై గెలిచాడు.
సఫారీలకు భారీ విజయం ; జింబాబ్వేపై 236 పరుగులతో గెలుపు
బులవాయొ: జింబాబ్వేతో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా రికార్డు విజయం సాధించింది. బులవాయొ వేదికగా మూడు రోజుల్లోనే ముగిసిన ఈ టెస్టులో సఫారీ జట్టు.. ఇన్నింగ్స్ 236 పరుగులతో విజయదుందుభి మోగించింది. తొలి ఇన్నింగ్స్‌లో తాత్కాలిక సారథి వియాన్ ముల్దర్ (367*) త్రిశతకంతో 626/5 పరుగుల భారీ స్కోరు చేసిన సౌతాఫ్రికా.. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికాను 170 పరుగులకు ఆలౌట్ చేసి ఫాలోఆన్ ఆడించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు 220 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్‌ను దక్షిణాఫ్రికా.. 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది.