హైదరాబాద్, ఆట ప్రతినిధి: భువనేశ్వర్ (ఒడిషా)లో ఆలిండియా ఫుట్బాల్ సమాఖ్యతో కలిసి ఫిఫా నిర్వహిస్తున్న ఫుట్బాల్ అకాడమీకి తెలంగాణ విద్యార్థి రుద్రాక్ష్ బన్సాల్ ఎంపికయ్యాడు.
స్థానిక గ్లెండేల్ అకాడమీ, సన్ సిటీలో 9వ తరగతి చదువుతున్న రుద్రాక్ష్.. దేశవ్యాప్తంగా వేలాదిమంది ఆశావహ ఆటగాళ్ల మధ్య ఐదు కఠినమైన ఎంపికదశల్ని దాటి ఈ గౌరవాన్ని పొందాడు. ఫిఫా అకాడమీకి దేశవ్యాప్తంగా 19 మంది ఎంపికవగా తెలంగాణ నుంచి రుద్రాక్ష్ చోటు దక్కించుకోవడం విశేషం.