FIFA Worldcup: కొలంబియా షూటౌట్.. క్వార్టర్స్‌లోకి స్విట్జర్లాండ్
FIFA World Cup: ఫిఫా వరల్డ్‌కప్‌లో స్విట్జర్లాండ్ పెనాల్టీ షూటౌట్ ఆధారంగా కొలంబియాపై విజయాన్ని నమోదు చేసింది. 4-3 గోల్స్ తేడాతో షూటౌట్లో స్విస్ నెగ్గింది. తొలుత ఇరు జట్ల మధ్య రౌండ్16 మ్యాచ్ డ్రాగా ముగిసింది. క్వార్టర్స్‌లో అర్జెంటీనాతో స్విట్జర్లాండ్ తలపడనున్నది.
వాంకోవర్: ఫిఫా వరల్డ్‌కప్(FIFA Worldcup)లో మంగళవారం మరో మ్యాచ్ ఉత్కంఠంగా జరిగింది. స్విట్జర్లాండ్ పెనాల్టీ షూటౌట్ ఆధారంగా కొలంబియాపై విజయాన్ని నమోదు చేసింది. 4-3 గోల్స్ తేడాతో షూటౌట్లో స్విస్ నెగ్గింది. తొలుత ఇరు జట్ల మధ్య రౌండ్16 మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఎక్స్ట్రా టైంలో కూడా రెండు జట్లు గోల్స్ చేయలేకపోయాయి. అయితే పెనాల్టీ షూటౌట్లో మాత్రం స్విస్‌కు కలిసి వచ్చింది. కీలకమైన నిర్ణయాత్మక పెనాల్టీని రూబెన్ వర్గాస్ గోల్‌గా మలచడంతో స్విట్జర్లాండ్ బృందంలో సంబరాలు మొదలయ్యాయి. కొలంబియాపై 4-3 తేడాతో షూటౌట్లో నెగ్గిన స్విట్జర్లాండ్.. క్వార్టర్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాతో తలపడనున్నది. మిస్సోరీలోని కన్సాస్ సిటీలో శనివారం ఈ మ్యాచ్ జరగనున్నది.
ఫిఫా వరల్డ్‌కప్‌లో 1954 నుంచి ఇప్పటి వరకు స్విట్జర్లాండ్ క్వార్టర్స్‌లోకి ప్రవేశించలేదు. వరల్డ్‌కప్‌లో రెండు గోల్స్ కొట్టిన స్విస్ ప్లేయర్ వర్గాస్ ఈ మ్యాచ్‌లో స్టాపేజ్ టైంలో ఎంట్రీ ఇచ్చాడు. కొలంబియా ప్లేయర్లు డేవిన్సన్ సాంచేజ్, కూచో హెర్నాండేజ్ .. షూటౌట్లో విఫలం అయ్యారు. దీంతో స్విట్జర్లాండ్ విక్టరీకి మార్గం ఈజీ అయ్యింది. వాస్తవానికి స్విట్జర్లాండ్ జట్టులో కీలక ప్లేయర్ అయిన జోహన్ మన్జంబీ.. మోకాలి గాయం వల్ల ఈ మ్యాచ్‌లో ఆడలేదు. అటాక్ ప్లేయర్ లేకపోవడంతో స్విస్ తీవ్ర ఇబ్బందులు పడింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

