RR vs KKR | రాజస్థాన్ థ్రిల్లింగ్ విక్టరీ.. చాహల్ మాయతో బోల్తా పడిన కోల్‌కతా
సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించిన మ్యాచ్. క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ జట్టు జోస్ బట్లర్ (103), సంజు శాంసన్ (38), దేవదత్ పడిక్కల్ (24), హెట్మెయర్ (26 నాటౌట్) రాణించడంతో ఏకంగా 217 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో కోల్‌కతా బ్యాటర్లు ఆది నుంచే ఎదురుదాడికి దిగారు.
తొలి బంతికే సునీల్ నరైన్ (0) రనౌట్ అవడంతో కొంత కంగారు పడినప్పటికీ.. ఆరోన్ ఫించ్ (58), శ్రేయాస్ అయ్యర్ (85) అద్భుతంగా ఆడటంతో కోల్‌కతా జట్టు గెలిచేలా కనిపించింది. అయితే నితీష్ రాణా (18) అవుటైన తర్వాత కేకేఆర్ బ్యాటర్లు ఎవరూ కనీసం ప్రతిఘటన ఇవ్వలేకపోయారు. భారీ అంచనాలున్న ఆండ్రీ రస్సెల్ (0) తొలి బంతికే అశ్విన్ బౌలింగ్‌లో గోల్డెన్ డక్‌గా వెనుతిరిగాడు.
ఆ తర్వాత పదిహేడో ఓవర్లో యుజ్వేంద్ర చాహల్ సూపర్ ఓవర్‌తో కోల్‌కతా విజయావకాశాలను పూర్తిగా దెబ్బతీశాడు. ఆ ఓవర్లో హ్యాట్రిక్ సహా మొత్తం నాలుగు వికెట్లు తీసిన చాహల్.. కీలకమైన శ్రేయాస్ అయ్యర్ వికెట్ కూడా తీసుకున్నాడు. దీంతో రాజస్థాన్ జట్టును మళ్లీ పోటీలోకి తీసుకొచ్చాడు. అయితే ఆ తర్వాతి ఓవర్లో ట్రెంట్ బౌల్ట్ ఏకంగా 20 పరుగులు సమర్పించుకొని కేకేఆర్ ఆశలు పెంచాడు.
కానీ చివరి ఓవర్ వేసిన కొత్త ఆటగాడు మెక్కాయ్.. ఆ ఓవర్లో షెల్డాన్ జాక్సన్ (8), ఉమేష్ యాదవ్ (21)ను అవుట్ చేయడంతో కేకేఆర్ కథ ముగిసింది. ఇది కోల్‌కతాకు వరుసగా మూడో ఓటమి. రాజస్థాన్ బౌలర్లలో చాహల్ ఐదు వికెట్లతో సత్తా చాటగా.. ఓబెడ్ మెక్కాయ్ 2, ప్రసిద్ధ్ కృష్ణ, అశ్విన్ చెరో వికెట్ తీసుకున్నారు. దీంతో కేకేఆర్ జట్టు 210 పరుగులకు ఆలౌట్ అయి, విజయానికి ఏడు పరుగుల దూరంలో చాపచుట్టేసింది.
Special feat deserves special celebration! 🙌🙌
Hat-trick hero @yuzi_chahal! 👏 👏
Follow the match ▶️ https://t.co/f4zhSrBNHi#TATAIPL | #RRvKKR | @rajasthanroyals pic.twitter.com/NhAmkGdvxo
— IndianPremierLeague (@IPL) April 18, 2022
https://twitter.com/rajasthanroyals/status/1516116277953466370
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- ipl 2022
- RR vs KKR
- Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

