చెన్నైతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ మరో వికెట్ కోల్పోయింది. జోస్ బట్లర్ (2) అవుటైన తర్వాత వచ్చిన కెప్టెన్ సంజూ శాంసన్ (15) కూడా అవుటయ్యాడు. శాంట్నర్ వేసిన 9వ ఓవర్లో బౌలర్ తల మీదుగా బౌండరీ బాదడానికి ప్రయత్నించిన శాంసన్.. శాంట్నర్కే చిక్కాడు. తలపై నుంచి వెళ్తున్న బంతిని టక్కున జంప్ చేసి అందుకున్నాడు శాంట్నర్. దీంతో 67 పరుగుల వద్ద రాజస్థాన్ రెండో వికెట్ కోల్పోయింది. శాంసన్ వెనుతిరగడంతో పడిక్కల్ క్రీజులోకి వచ్చాడు. 9 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ జట్టు 2 వికెట్ల నష్టానికి 71 పరుగులతో నిలిచింది.