Piers Morgan | ఆ విషయం రొనాల్డోకు ముందే తెలుసు : పియెర్స్ మోర్గాన్
రొనాల్డోతో తమ కాంట్రాక్టు ముగిసిందని యునైటెడ్ క్లబ్ మంగళవారం తెలిపింది
Piers Morgan : ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ఒక బ్రిటీష్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ వివాదస్పదమైన సంగతి తెలిసిందే. ఆ ఇంటర్వ్యూ చేసిన పియెర్స్ మోర్గాన్ అమెరికాలో మాట్లాడుతూ.. ఇంటర్వ్యూ అనంతరం మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌తో తన జర్నీ ముగుస్తుందనే విషయం రొనాల్డోకు ముందే తెలుసు. నిజంగా చెప్తున్నా.. రొనాల్డోకు తాను ఏం మాట్లాడుతున్నాడో, దానివల్ల ఏం జరుగుతుందో ముందే తెలుసు అని మోర్గాన్ తెలిపాడు. ఆ ఇంటర్వ్యూలో రొనాల్డో తనతో ఒప్పందం చేసుకున్న మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్, మేనేజర్‌పై తీవ్ర విమర్శలు చేశాడు.
‘మా క్లబ్ మేనేజర్ ఎరిక్ టెన్ హగ్ నన్ను గౌరవించడు. నాకు కూడా అతని మీద గౌరవం లేదు. నేను మోసపోయాను. నన్ను క్లబ్ నుంచి బయటకు పంపించాలని చూస్తున్నారు’ అని ఇంటర్వ్యూలో రొనాల్డో యునైటెడ్ క్లబ్‌పై తీవ్ర ఆరోపణలు చేశాడు. దాంతో, రొనాల్డోతో తమ కాంట్రాక్టు ముగిసిందని, అందుకు ఇరుపక్షాల అంగీకారం ఉందని యునైటెడ్ క్లబ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఫిఫా వరల్డ్ కప్‌లో పోర్చుగల్ 3-2గోల్స్ తేడాతో ఘనాపై విజయం సాధించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mohammed Shami: టెస్టు క్రికెట్‌కు అల్విదా ప్రకటించిన బౌలర్ షమీ.. వీడియో
Doodimetla Balaraj Yadav | కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ.. దూదిమెట్లకు బెయిల్ మంజూరు
Salman Khan | ప్రభుత్వ ఒత్తిడితో కథ మార్చలేదు.. ‘మాతృభూమి’ వివాదాలపై సల్మాన్ ఖాన్ ఫుల్ క్లారిటీ!
RC 17 | ఆర్సీ17లో రామ్ చరణ్ సరసన ఆ ఇద్దరిలో ఒకరు .. హీరోయిన్ విషయంలో సుకుమార్ కీలక నిర్ణయం!
IND vs NZ | భారత్ దెబ్బకు న్యూజిలాండ్ విలవిల.. 53 పరుగులకే 5 వికెట్లు డౌన్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

