Rohit Sharma : భారత క్రికెట్లో దిగ్గజ కెప్టెన్ అనగానే మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni), విరాట్ కోహ్లీ (Virat Kohli), సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) అని ఠక్కున చెబుతారు చాలామంది. కానీ, రికార్డులు చూస్తేనే రోహిత్ శర్మ (Rohit Sharma) వీరందరికంటే ‘ది బెస్ట్’ అని తెలుస్తుంది. టీమిండియాకు వరుసగా రెండు ఐసీసీ ట్రోఫీలు, అత్యధిక విజయాలు అందించిన సారథి అతడే. అయితే.. ఆస్ట్రేలియా పర్యటనకు స్క్వాడ్ ఎంపికతో కెప్టెన్‌గా రోహిత్ ప్రస్థానం ముగిసింది. వచ్చే వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకొని యువకుడైన శుభ్‌మన్ గిల్ (Shubman Gill)కు పగ్గాలు అప్పగించారు సెలెక్టర్లు. ఇప్పటికే టీ20, టెస్టు కెప్టెన్సీతో పాటు ఈ రెండు ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన ఈ డాషింగ్ బ్యాటర్ ఇక ఆటగాడిగానే ఆసీస్ సిరీస్‌లో ఆడనున్నాడు.
టీమిండియాను వన్డేల్లో తిరుగులేని జట్టుగా నిలిపిన ఘనత రోహిత్‌కే దక్కుతుంది. ఎందుకంటే.. అతడి సారథ్యంలోనే టీమిండియా అత్యధికంగా 75శాతం విజయాలు నమోదు చేసింది. హిట్‌మ్యాన్ నేతృత్వంలో 56 వన్డేలు ఆడిన భారత జట్టు 42 మ్యాచుల్లో జయకేతనం ఎగురవేసింది. ఒక మ్యాచ్ టైకాగా.. మరొక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. అంతర్జాతీయంగా 50 వన్డేలకు కెప్టెన్సీని పరిగణనలోకి తీసుకుంటే.. వెస్టిండీస్ వెటరన్ క్లైవ్ లాయిడ్ (Clive Lloyd) టాప్‌లో ఉన్నాడు.
𝙏𝙝𝙚 𝙍𝙤-𝙃𝙞𝙩 𝙀𝙛𝙛𝙚𝙘𝙩 🔥
Asia Cup 2023 🏆
ICC Champions Trophy 2025 🏆A salute to the ODI Captaincy tenure of Rohit Sharma 🫡#TeamIndia | @ImRo45 pic.twitter.com/hdj8I3zrQT
— BCCI (@BCCI) October 4, 2025
లాయిడ్ సారథ్యంలో అజేయ శక్తిగా అవతరించిన విండీస్ 76.2శాతం విజయాలతో రికార్డు నెలకొల్పింది. అనంతరం.. 75శాతం విక్టరీ మార్క్ రోహిత్‌కే సాధ్యమైందంది. ఆస్ట్రేలియాకు మూడు వన్డే వరల్డ్ కప్‌లు అందించిన రికీ పాంటింగ్ (Ricky Ponting) సైతం 71.7శాతంతో మూడో స్థానంలో ఉన్నాడు. అదే కోహ్లీ నాయకత్వంలో భారత్ వన్డేల్లో 68.4శాతం విజయాలకే పరిమితం కాగా.. మిస్టర్ కూల్ కెప్టెన్ ధోనీ హయాంలో ఆ శాతం.. 55 మాత్రమే.
ROHIT SHARMA AS ODI CAPTAIN OF INDIA:
– 56 matches, 42 Wins.
– 75% Winning percentage.
– Finals in ODI World Cup.
– Won Champions Trophy.
– Best Win percentage for India.THE HITMAN, ONE OF THE GREATEST EVER. 🙇♂️ pic.twitter.com/gUEzuFrUtI
— Tanuj (@ImTanujSingh) October 4, 2025
విధ్వంసక ఓపెనర్‌గా శుభారంభాలు ఇవ్వడమే కాదు కెప్టెన్‌గా జట్టును గొప్పగా నడిపించడం రోహిత్‌కు బాగా తెలుసు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians)కు ఐదు ట్రోఫీలు కట్టబెట్టిన రోహిత్.. టీమిండియాకు మూడు టైటిళ్లు అందించాడు. ఇందులో రెండు ఐసీసీ కప్‌లు ఉండడం విశేషం. 2018లో అతడి సారథ్యంలోని భారత్ ఆసియా కప్ విజేతగా నిలిచింది. 2023లో వన్డే వరల్డ్ కప్‌లో అజేయంగా ఫైనల్ చేరిన టీమిండియా.. ఒత్తిడికి తలొగ్గి ఆస్ట్రేలియాకు కప్‌ను వదిలేసింది. అయితే.. వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన టీ20 ప్రపంచకప్‌లో ఓటమన్నదే ఎరుగకుండా టైటిల్‌ను పట్టేసింది రోహిత్ బృందం.
Rohit Sharma’s captaincy was revolutionary.🐐 pic.twitter.com/YqLtBLcOEi
— Gems of Cricket (@GemsOfCrickets) October 4, 2025
అదే ఉత్సాహంతో ఈ ఏడాది దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలోనూ టీమిండియా హవా చూపించింది. ఫైనల్లో న్యూజిలాండ్‌ను చిత్తు చేస్తూ విజేతగా ట్రోఫీని ముద్దాడింది. వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ వంటి మల్టీ నేషనల్ టోర్నీలో రోహిత్ కెప్టెన్సీలోని భారత్ రికార్డు స్థాయిలో విజయాలు సాధించింది. ఏకంగా 88.8 శాతం విక్టరీలతో అతడికి ఎనలేని గుర్తింపు ఉంది. 84.4శాతంతో రికీ పాంటింగ్ రెండు, క్లైవ్ లాయిడ్ 80.0శాతంతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఎంఎస్ ధోనీ 75.0 శాతంతో నాలుగో ప్లేస్‌లో ఉన్నాడు.