Rohit Sharma: రోహిత్ డకౌట్.. గిల్‌పై ఆగ్రహం.. వీడియో
Rohit Sharma: ఆఫ్గన్‌తో మ్యాచ్‌లో రనౌటైన రోహిత్ శర్మ.. నాన్ స్ట్రయికర్ శుభమన్ గిల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మిడాఫ్కు షాట్ కొట్టి రోహిత్ సింగిల్ కోసం ఉరికాడు. అయితే నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న గిల్ మాత్రం కదల్లేదు. అద్భుతమైన ఫీల్డింగ్ చేసిన ఆఫ్ఘనీ ప్లేయర్.. స్ట్రయికర్ దిశగా బంతిని విసిరాడు. దీంతో రోహిత్ రనౌటయ్యాడు. గ్రౌండ్ నుంచి వెళ్లిపోతూ రోహిత్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. గిల్ ను చూస్తూ కోపంగా సంకేతాలిచ్చాడు.
మొహాలీ: ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో.. రోహిత్ శర్మ(Rohit Sharma) రనౌటయ్యాడు. దాదాపు 14 నెలల గ్యాప్ తర్వాత మళ్లీ టీ20 ఫార్మాట్ ఆడుతున్న అతను తొలి మ్యాచ్‌లోనే డకౌటయ్యాడు. టీ20 వరల్డ్‌కప్ జరగనున్న నేపథ్యంలో అతను ఈ ఫార్మాట్‌పై మళ్లీ ఫోకస్ పెట్టాడు. అయితే ఆఫ్ఘన్‌తో మ్యాచ్‌లో అనూహ్యంగా రనౌటయ్యాడు. తొలి ఓవర్ రెండో బంతికే అతను నిష్క్రమించాడు. ఫజల్లాక్ ఫారూకీ వేసిన ఆ ఓవర్లో.. మిడాఫ్ వైపు భారీ షాట్ కొట్టి పరుగు తీయబోయాడు. అయితే నాన్ స్ట్రయికర్ శుభమన్ గిల్ మాత్రం ఒక్క అంగుళం కూడా ముందుకు జరగలేదు. రోహిత్ మాత్రం నాన్ స్ట్రయికర్ వైపు పూర్తిగా వచ్చేశాడు. ఆఫ్ఘన్ ఫీల్డర్ చాలా చాకచక్యంగా తన చేతుల్లోని బంతిని స్ట్రయికర్ ఎండ్‌కు విసిరాడు. దీంతో రోహిత్ రనౌటయ్యాడు. ఆ సమయంలో కెప్టెన్ రోహిత్ ఆగ్రహానికి గురయ్యాడు. గిల్ వైపు చూస్తూ ఆవేశంతో ఏదో తిట్టాడు. డగౌట్ వైపు వెళ్తూ గిల్‌కు సంకేతం చేశాడు. సింగిల్ తీసుకోవడానికి గిల్ రెఢీగా లేకున్నా రోహిత్ మాత్రం నాన్ స్ట్రయికర్ దిశగా పరుగు తీశాడు.
Rohit gone for duck 😭#RohitSharma #Gill #IndvsAfg #INDvAFG pic.twitter.com/xpSGnreCm5
— Shubham Chand (@shubhamchand768) January 11, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

