న్యూఢిల్లీ : రోహిత్ శర్మ(Rohit Sharma) తన సోదరుడు విశాల్‌పై కాస్త సీరియస్ అయ్యాడు. అతనికి ఇష్టమైన కారుకు డెంట్ కావడంతో.. ఆ కోపాన్ని వ్యక్తం చేశాడు. ఈ ఘటన వాంఖడే స్టేడియంలో జరిగింది. రోహిత్ శర్మ పేరటి వాంఖడే స్టేడియంలో ఓ కొత్త స్టాండ్‌ను ఏర్పాటు చేశారు. శుక్రవారం దానికి ఓపెనింగ్ సెర్మనీ చేశారు. ఆ కార్యక్రమంలో రోహిత్ ఫ్యామిలీ పాల్గొన్నది. అయితే స్టాండ్ ఓపెనింగ్ కార్యక్రమం ముగిసిన తర్వాత ఇంటికి వెళ్తున్న సమయంలో కారు పార్కింగ్ ఏరియాలో రోహిత్ శర్మ ఆగ్రహానికి గురయ్యాడు.
Proper car lover. Dents are not allowed.😭🔥 pic.twitter.com/Dos7jPwVUj
— 𝐇𝐲𝐝𝐫𝐨𝐠𝐞𝐧 (@ImHydro45) May 16, 2025
కారు వెనుక భాగంలో సొట్ట పడడంతో.. ఆ ప్రాంతాన్ని చూపిస్తూ సోదరుడు విశాల్‌పై రోహిత్ సీరియస్ అయ్యాడు. యే క్యా హై అంటూ కోపంగా అడిగాడు. అయితే రివర్స్ సమయంలో అలా జరిగినట్లు విశాల్ చెప్పాడు. సోదరుడు ఇచ్చిన జవాబుతో మరింత కోపానికి గురైన రోహిత్.. ఎవరి వల్లా , నీ వల్లే ఇదంతా జరిగిదంటూ విశాల్‌పై సీరియస్ అయ్యాడు. రోహిత్ శర్మ పేరెంట్స్ గురునాథ్, పూర్ణిమా శర్మ, భార్య రితికా సజ్దే కూడా అక్కడే ఉన్నారు. ఈ ఘటనకు చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతున్నది.
కొన్ని రోజుల క్రితం టెస్టులకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.