అడిలైడ్ : ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో జరుగుతున్న డే అండ్ నైట్ టెస్టులో టీమిండియా కష్టాల్లో పడింది. ఇవాళ డిన్నర్ తర్వాత ఇండియా అయిదో వికెట్‌ను కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) కేవలం 3 రన్స్ చేసి.. బోలాండ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ ఔటయ్యాడు. పెర్త్ టెస్టుకు గైర్హాజరు అయిన రోహిత్.. రెండో టెస్టులో మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు దిగాడు. ఆరవ బ్యాటర్‌గా కోహ్లీ అవుటైన తర్వాత రోహిత్ క్రీజ్‌లోకి వచ్చాడు. కానీ ఆసీస్ స్పీడ్స్టర్లను ఎదుర్కోవడంలో రోహిత్ సక్సెస్ కాలేకపోయాడు. జైస్వాల్, రాహుల్ ఓపెనింగ్ జోడిని బ్రేక్ చేయవద్దు అన్న ఉద్దేశంతో రోహిత్ రెండో టెస్టుకు మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు దిగాడు.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు తొలి సెషన్లో తొలి బంతికే జలక్ తగిలింది. స్టార్క్ వేసిన ఫస్ట్ బాల్కే జైస్వాల్ డకౌటయ్యాడు. ఇక ఆ తర్వాత గిల్, రాహుల్ కాసేపు ఆసీస్ స్పీడ్ బౌలర్లను ఎదుర్కొన్నారు. 69 రన్స్ వద్ద రెండో వికెట్ కోల్పోయింది భారత్. రాహుల్ 37 రన్స్ చేసి నిష్క్రమించాడు. అయితే ఆ తర్వాత కోహ్లీ, గిల్ కూడా వెంటవెంటనే పెవిలియన్ చేరుకున్నారు. గిల్ 31 రన్స్ చేయగా, కోహ్లీ ఏడు పరుగులకు ఔటయ్యారు. ప్రస్తుతం పంత్, నితీశ్ రెడ్డి క్రీజ్‌లో ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం ఇండియా 30 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 94 రన్స్ చేసింది.