న్యూఢిల్లీ: భారత టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న పారిస్ ఒలింపిక్స్‌లో తనతో కలిసి ఆడబోయే సహచర ఆటగాడిగా శ్రీరామ్ బాలాజీని ఎంచుకున్నాడు. ఈ మేరకు అతడు ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్ (ఐటా)కు మెయిల్ చేసినట్టు మంగళవారం వెల్లడించగా ఐటా సైతం దీనిని ధృవీకరించింది. గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న బాలాజీ.. మూడు రోజుల క్రితమే ఫ్రెంచ్ ఓపెన్ ప్రిక్వార్టర్స్‌లో మెక్సికన్ ఆటగాడు రేయెస్-వరెలతో కలిసి బోపన్న – ఎబ్డెన్ జోడీకి గట్టి పోటీనిచ్చాడు. బోపన్నకు సహచరుడిగా యూకీ బాంబ్రీ సైతం పోటీలో నిలిచినా అతడు మాత్రం బాలాజీ వైపునకే మొగ్గుచూపాడు.