Rinku Singh | 100 మీటర్ల సిక్సర్ బాదిన రింకూ.. విస్తుపోయిన ఆసీస్ సారథి.. వీడియో
Rinku Singh : ఐపీఎల్ హీరో రింకూ సింగ్(Rinku Singh) టీ20ల్లో దంచికొడుతున్నాడు. లోయర్ ఆర్డర్లో చెలరేగుతూ ఫినిషర్‌గా ప్రశంసలు అందుకుంటున్నాడు. సిరీస్ డిసైడర్ అయిన నాలుగో టీ20లో ఈ సిక్సర్ల పిడుగు కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆస్ట్రేలియాతో రాయ్‌పూర్(Raipur) వేదికగా జరిగిన మ్యాచ్‌లో రింకూ 29 బంతుల్లో....
Rinku Singh : ఐపీఎల్ హీరో రింకూ సింగ్(Rinku Singh) టీ20ల్లో దంచికొడుతున్నాడు. లోయర్ ఆర్డర్లో చెలరేగుతూ ఫినిషర్‌గా ప్రశంసలు అందుకుంటున్నాడు. సిరీస్ డిసైడర్ అయిన నాలుగో టీ20లో ఈ సిక్సర్ల పిడుగు కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆస్ట్రేలియాతో రాయ్‌పూర్(Raipur) వేదికగా జరిగిన మ్యాచ్‌లో రింకూ 29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 46 పరుగులు చేసి జట్టుకు పొరాడగలిగే స్కోర్ అందించాడు.
రింకూ సుడిగాలి ఇన్నింగ్స్‌లో ఓ భారీ సిక్సర్ ఉంది. బెన్ డ్వార్షే(Ben Dwarshuis) వేసిన 13వ ఓవర్ ఆఖరి బంతికి ఈ లెఫ్ట్ హ్యాండర్ స్వీప్ షాట్ ద్వారా 100 మీటర్ల సిక్సర్ బాదాడు. రింకూ కొట్టిన బంతి అంత దూరం వెళ్లడంతో ఆసీస్ సారథి మాథ్యూ వేడ్(Mathew Wade) నమ్మశక్యంకానట్టు చూస్తుండిపోయాడు.
Just Rinku-verse things 😍
Keep watching the action LIVE on #JioCinema, #Sports18 & #ColorsCineplex 🙌#IDFCFirstBankT20ITrophy #INDvAUS #TeamIndia #JioCinemaSports pic.twitter.com/vfsakRGncp
— JioCinema (@JioCinema) December 1, 2023
నాలుగో టీ20లో భారత జట్టు(Team India) అదరగొట్టింది. రింకూ సింగ్(46) ఒంటరి పోరాటంతో 174 పరుగులకే పరిమతమైన భారత్ స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుంది. ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా (Australia)ను 20 పరుగుల తేడాతో మట్టికరిపించింది. వరల్డ్ కప్ ఫైనల్లో ఎదురైన ఓటమికి యువ భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మూడో విజయంతో ఐదు టీ20ల సిరీస్(T20 Series)ను కైవసం చేసుకుంది. ఆఖరి ఓవర్లో 31 పరుగులు అవసరమవగా.. అవేశ్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి జట్టును గెలిపించాడు. ఆసీస్ కెప్టెన్ మాథ్యూ వేడ్(36 నాటౌట్) చివరిదాకా పోరాడినా ఫలితం లేకపోయింది.
ఇవి కూడా చదవండి
-
IPL 2024 | ఆల్‌రౌండర్ల వేటలో పంజాబ్ కింగ్స్.. ఆ ఇద్దరిని కొంటుందా..?
-
Chittagong | చిట్టగాంగ్‌లో 5.6 తీవ్రతతో భారీ భూకంపం.. ఢాకాలో ప్రకంపణలు
-
Ladakh | లడఖ్‌లో స్వల్పంగా కంపించిన భూమి.. భయాందోళనలో ప్రజలు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

