SA vs AUS | రెన్షా సూపర్ సెంచరీ.. గొప్పగా పుంజుకున్న ఆస్ట్రేలియా..!
SA vs AUS : ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కీలకమైన డర్బన్ టెస్టులో ఆస్ట్రేలియా (Australia) గొప్పగా పుంజుకుంది. తొలిరోజు 84 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన ఆసీస్.. మ్యాట్ రెన్షా(102 నాటౌట్) పోరాటంతో గట్టెక్కింది.
SA vs AUS : ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కీలకమైన డర్బన్ టెస్టులో ఆస్ట్రేలియా (Australia) గొప్పగా పుంజుకుంది. దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి తొలిరోజు 84 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన ఆసీస్.. మ్యాట్ రెన్షా(102 నాటౌట్) పోరాటంతో గట్టెక్కింది. సఫారీ పేస్ దళాన్ని దీటుగా ఎదుర్కొన్న రెన్షా సూపర్ శతకంతో చెలరేగాడు. అతడికి కెప్టెన్ ప్యాట్ కమిన్స్(43) నుంచి చక్కని సహకారం లభించడంతో లంచ్ బ్రేక్ సమయానికి 8 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది.
శాండ్‌పేపర్ గేట్ వివాదం తర్వాత దక్షిణాఫ్రికా గడ్డపై తొలి టెస్టు సిరీస్ ఆడుతున్న ఆస్ట్రేలియా గాడీలో పడింది. తొలిరోజు డర్బన్‌లో సఫారీ పేస్ త్రయం ధాటికి పీకల్లోతు కష్టాల్లో పడిన ఆసీస్‌ను మ్యాట్ రెన్షా(102 నాటౌట్), సారథి ప్యాట్ కమిన్స్(43)లు ఆదుకున్నారు. ఓవర్‌నైట్ స్కోర్ 187/6తో రెండో రోజు ఆట మొదలెట్టిన కంగారూ జట్టును రెన్షా ఒడ్డున పడేశాడు.
A three-year Test exile. No Test hundred since 2017. Facing the reigning World Test Champions, away from home, with Australia in big trouble at 84-4.
The odds meant nothing. Matt Renshaw delivers a defiant Durban masterclass 👏 https://t.co/rvisPja9xC
— Cricinfo (@cricinfo) October 10, 2026
అనుభవజ్ఞులైన ట్రావిస్ హెడ్(9), లబూషేన్(37), స్టీవెన్ స్మిత్(25), అలెక్స్ క్యారీ(14)లు విఫలమైన చోట క్రీజులో పాతుకుపోయి సఫారీలను తిప్పలు పెట్టిన అతడు.. ఈ ఫార్మాట్లో రెండోసారి మూడంకెల స్కోరందుకున్నాడు. రెన్షా అసమాన పోరాటం ఫలితంగా భోజన విరామం సమయానికి పర్యాటక జట్టు 8 వికెట్ల నష్టానికి 277 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. శతక వీరుడికి జతగా సీనియర్ ఆటగాడు నాథన్ లియన్(8 నాటౌట్) ఉన్నాడు. ప్రొటిస్ బౌలర్లలో వియాన్ మల్డర్(4-51) నాలుగు వికెట్లు తీశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రెన్షా సూపర్ సెంచరీ.. గొప్పగా పుంజుకున్న ఆస్ట్రేలియా..!
Netflix | నెట్‌ఫ్లిక్స్‌లో భారీ ఉద్యోగాల కోత.. 5 శాతం సిబ్బందిని తొలగించేందుకు సన్నాహాలు!
Tragedy | పాకాల బీచ్‌లో విషాదం.. ఇద్దరు మృతి, మరో ఇద్దరు గల్లంతు
ఎంవి పాలెం సమీపంలో పెద్దపులి సంచారం కలకలం?
Mrunal Takhur | ఇతరుల జీవితాలపై కామెంట్స్ చేయడానికి మీరెవరు.. మృణాల్ ఠాకూర్ సీరియస్
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

