Kohli – Renshaw | కోహ్లీకి ఊహించని షాకిచ్చిన ఆసీస్ బ్యాటర్.. చిరస్మరణీయ శతకంతో పదేళ్ల రికార్డు బ్రేక్..!
Kohli - Renshaw: ఇటీవల అంతర్జాతీయ వన్డేల్లో రికార్డుల హోరుతో దూసుకెళ్తున్న విరాట్ కోహ్లీ (Virat Kohli )కి ఆస్ట్రేలియా ఆటగాడు ఊహించని షాకిచ్చాడు. డర్బన్ టెస్టులో చిరస్మరణీయ శతకంతో ఆసీస్‌ను ఆదుకున్న మ్యాట్ రెన్షా (Matt Renshaw) కోహ్లీ పేరిట ఉన్న రికార్డును బద్ధలు కొట్టాడు.
Kohli – Renshaw: ఇటీవల అంతర్జాతీయ వన్డేల్లో రికార్డుల హోరుతో దూసుకెళ్తున్న విరాట్ కోహ్లీ (Virat Kohli )కి ఆస్ట్రేలియా ఆటగాడు ఊహించని షాకిచ్చాడు. డర్బన్ టెస్టులో చిరస్మరణీయ శతకంతో ఆసీస్‌ను ఆదుకున్న మ్యాట్ రెన్షా (Matt Renshaw) కోహ్లీ పేరిట ఉన్న రికార్డును బద్ధలు కొట్టాడు. టెయిలెండర్లతో కలిసి విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పిన అతడు.. పదేళ్లుగా చెక్కుచెదరని విరాట్ ఘనతను తన సొంతం చేసుకున్నాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి కంగారూ టీమ్‌ను ఒడ్డున పడేసిన రెన్షా డబుల్ సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. టీమిండియా రన్ మెషీన్‌ను అధిగమించినందుకు మస్త్ ఖుషీ అయ్యాడు.
టెస్టుల్లోనూ తన మార్క్ ఇన్నింగ్స్‌లతో అలరించిన విరాట్ కోహ్లీ నుంచి ఓ రికార్డును మ్యాట్ రెన్షా లాగేసుకున్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో డర్బన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఖతర్నాక్ శతకం బాదిన ఈ లెఫ్ట్‌హ్యాండర్ పదేళ్ల క్రితం విరాట్ నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేశాడు. సుదీర్ఘ ఫార్మాట్లో రెండో సెంచరీ నమోదు చేసిన అతడు.. టెయిలెండర్లతో కలిసి అత్యధిక పరుగులు జోడించిన బ్యాటర్‌గా అవతరించాడు.
Matt Renshaw has now scored the most runs (174 and counting) in a Test innings while batting with the tail since 2002
The previous most was 171 by Virat Kohli during his 235 against England at the Wankhede in 2016 https://t.co/ocsTINOduy
— Cricinfo (@cricinfo) October 10, 2026
కోహ్లీ.. ఇంగ్లండ్‌పై
ఇంగ్లండ్‌పై 2016లో వాంఖడే టెస్టులో కోహ్లీ తన కెరీర్లో మరపురాని ద్విశతకం(235) బాదాడు. ఆ మ్యాచ్‌లో ఏడో వికెట్ పడ్డాక మిగతా వారితో కలిసి కోహ్లీ సాధించిన 171 పరుగులను డర్బన్ టెస్టులో రెన్షా దాటేశాడు. తద్వారా 2002 అనంతరం టెయిలెండర్లు(8-11 స్థానం బ్యాటర్లు) అండగా అత్యధిక పరుగులు రాబట్టిన ఆటగాడిగా గుర్తింపు సాధించడీ ఆసీస్ ఆటగాడు. తొలి రోజే సఫారీ పేసర్ల విజృంభణతో 84కే నాలుగు వికెట్లు కోల్పోయిన జట్టుకు కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. టెయిలెండర్లతో కలిసి 390 పరుగుల భారీ స్కోరందించాడతడు. చివరి ఆటగాళ్ల సహకారంతో ఈ లెఫ్ట్ హ్యాండర్ 174 రన్స్ జోడించగా.. భారత మాజీ కెప్టెన్ రెండో స్థానానికి పడిపోయాడు.
A three-year Test exile. No Test hundred since 2017. Facing the reigning World Test Champions, away from home, with Australia in big trouble at 84-4.
The odds meant nothing. Matt Renshaw delivers a defiant Durban masterclass 👏 https://t.co/rvisPja9xC
— Cricinfo (@cricinfo) October 10, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kohli – Renshaw | కోహ్లీకి ఊహించని షాకిచ్చిన ఆసీస్ బ్యాటర్.. చిరస్మరణీయ శతకంతో పదేళ్ల రికార్డు బ్రేక్..!
Bloody Romeo | ఇంకా రచ్చ రచ్చే.. ‘బ్లడీ రోమియో’ కోసం నాని స్టైలిష్ మేకోవర్ చూశారా..?
Muscle Growth | 30 ఏళ్లు దాటిన తరువాత కండరాల నిర్మాణం సాధ్యం కాదా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Election Commission | ఎన్నికల సంఘానికి మాజీ ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల మద్దతు.. 124 మంది బహిరంగ లేఖ
Priyanka Gandhi | ‘దేశంలో ప్రజాస్వామ్యం లేదా..?’ కేంద్ర ప్రభుత్వంపై ప్రియాంకాగాంధీ ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

