Tim David : ఐపీఎల్ చరిత్రలో వరసగా రెండోసారి ట్రోఫీ గెలిచిన మూడో జట్టుగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)కు బిగ్ షాక్. అదిరే విజయంతో విక్టరీ సంబురాల్లో మునిగిపోయిన ఆ జట్టులోని విదేశీ ఆటగాడు టిమ్ డేవిడ్ (Tim David)పై వేటు పడింది. ఐపీఎల్ నియమావళిని ఉల్లంఘించిన అతడు వచ్చే సీజన్ తొలి మ్యాచ్ ఆడకుండా నిషేధానికి గురయ్యాడు. లెవల్ 1 తప్పిదానికి పాల్పడిని డేవిడ్‌కు మ్యాచ్ ఫీజులో ఏకంగా 50 శాతం కోతతో పాటు.. రెండు డీ మెరిట్ పాయింట్లు కేటాయించారు.
అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో ఆదివారం(మే 31) జరిగిన ఫైనల్లో టిమ్ డేవిడ్ ఐపీఎల్ కోడ్‌ను ఉల్లంఘించాడు. గుజరాత్ ఇన్నింగ్స్ సమయంలో 10వ ఓవర్లో అతడు ఐస్ ప్యాక్‌ను కోపంగా అంపైర్ నితిన్ మీనన్(Nitin Menon) వైపు విసిరాడు. ఆర్సీబీ స్టార్ తీరును తప్పుబట్టిన మ్యాచ్ రిఫరీ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నాడు. ఆర్టికల్ 2.9 ప్రకారం క్రికెట్ వస్తువులను దెబ్బతీయడం.. మ్యాచ్ అధికారి, అంపైర్, రిఫరీలను గాయపరిచేలా ప్రవర్తించడం వంటి వాటిని నేరంగా పరిగణిస్తారు.
JUST IN 🚨
Tim David fined 50% of his match fee and has accumulated two demerit points for breaching Level 1 of the IPL’s Code of Conduct.
David was found to have breached Article 2.9 after he threw an ice bag aggressively in the direction of umpire Nitin Menon.#IPL2026 pic.twitter.com/C0aunrujbM
— Cricbuzz (@cricbuzz) June 1, 2026
ఇన్నింగ్స్ మధ్యలో డేవిడ్ కోపంగా అంపైర్ నితిన్ వైపు ఐస్ ప్యాక్ విసరడం కూడా ఆర్టికల్ 2.9 కిందకే వస్తుంది. దాంతో.. అతడికి మ్యాచ్ ఫీజులో సగం కోత విధించారు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో అభ్యంతరమైన సంజ్ఞలతో ఒకటి, 54వ మ్యాచ్‌లో రెండు డీమెరిట్ పాయింట్లకు తోడు.. తాజా నేరానికి మరో రెండు కలిపి మొత్తం.. ఐదు డీమెరిట్ పాయింట్లు అయ్యాయి. ఫలితంగా.. 20వ సీజన్లో ఆర్సీబీ తొలి మ్యాచ్‌లో ఆడడానికి టిమ్ డేవిడ్‌ను అనర్హుడిగా ప్రకటించారు.