శ్రీలంక స్పిన్నర్ వానిందు హసరంగ మాయ చేశాడు. నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకునేలా కనిపించిన సునీల్ నరైన్ (12).. హసరంగ వేసిన బంతిని సరిగా అంచనా వేయలేకపోయాడు. దాంతో లీడింగ్ ఎడ్జ్ తీసుకున్న బంతిని ఆకాష్ దీప్ చక్కగా అందుకున్నాడు. దాంతో నరైన్ ఇన్నింగ్స్ ముగిసింది.
ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ షెల్డాన్ జాక్సన్ (0) గోల్డెన్ డక్‌గా వెనుతిరిగాడు. హసరంగ వేసిన గూగ్లీని జాక్సన్ అసలు ఊహించలేకపోయాడు. డ్రైవ్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ అతన్ని తప్పించుకున్న బంతి వికెట్లను కూల్చింది. దాంతో జాక్సన్ నిరాశగా పెవిలియన్ చేరాడు. అనంతరం 83 పరుగుల వద్ద శ్యాంబిల్లింగ్ హర్షద్‌కు దొరికిపోయాడు. పది ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ జట్టు 83/7 స్కోరుతో నిలిచింది.