Revanth Reddy | సీఎం రేవంత్‌రెడ్డికి కేరళ అవార్డు.. ‘బెస్ట్ పబ్లిక్ సర్వెంట్’గా సత్కారం
Revanth Reddy | రేవంత్‌రెడ్డికి కేరళలో ప్రతిష్ఠాత్మక ‘ఆర్యదాన్ మహమ్మద్-2026 బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ అవార్డు’ లభించింది. కేరళలోని నిలంబూరులో శుక్రవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పురసారాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సీఎం రేవంత్‌రెడ్డికి అందజేశారు.
Revanth Reddy | హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేరళలో ప్రతిష్ఠాత్మక ‘ఆర్యదాన్ మహమ్మద్-2026 బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ అవార్డు’ లభించింది. కేరళలోని నిలంబూరులో శుక్రవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పురసారాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సీఎం రేవంత్‌రెడ్డికి అందజేశారు. కేరళ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి దివంగత ఆర్యదాన్ మహమ్మద్ స్మారకార్థం ఆర్యదాన్ మహమ్మద్ ఫౌండేషన్ ఈ పురసారాన్ని ఏర్పాటుచేసింది.
అవార్డు కింద రూ.లక్ష నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందజేశారు. ఆర్యదాన్ మహమ్మద్ అవార్డు అందుకోవడం ఎంతో గౌరవంగా ఉన్నదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. దేశంలో ఓట్ల దొంగతనం, పార్టీల దొంగతనం, ఎన్నికల గుర్తుల దొంగతనం, నిధుల దొంగతనం జరుగుతున్నాయంటూ బీజేపీపై పరోక్షంగా ఆరోపణలు గుప్పించారు. ఫౌండేషన్ వరింగ్ చైర్మన్ షౌకత్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

