బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. మూడో ఓవర్లో బంతి అందుకున్న ఆస్ట్రేలియా సీమర్ హాజిల్‌వుడ్ బెంగళూరుకు తొలి బ్రేక్ ఇచ్చాడు. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (1)ను పెవిలియన్ చేర్చాడు. హాజిల్‌వుడ్ వేసిన బంతిని ఆడటానికి ప్రయత్నించిన గిల్ విఫలమయ్యాడు. దాంతో ఎడ్జ్ తీసుకున్న బంతి స్లిప్స్‌లో ఉన్న మ్యాక్స్‌వెల్ వైపు వెళ్లింది.
తనకు దూరంగా వెళ్తున్న బంతిని పట్టుకోవడానికి కుడి చేతివైపు డైవ్ చేసిన మ్యాక్సీ.. ఒంటి చేత్తో క్యాచ్ పట్టేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆ సూపర్ క్యాచ్‌తో గిల్ మారుమాట్లాడకుండా పెవిలియన్ బాటపట్టాడు. దీంతో గుజరాత్ జట్టు 21 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం సాహా, వేడ్ క్రీజులో ఉన్నారు.
What a catch maxi 🤩🤩 and virat agrression 🥵#RCBvsGT #RCB pic.twitter.com/563DgQuvyL
— Rohit Kumar (@skipper_kohli) May 19, 2022