ముంబై: ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఆటలోనే కాదు దాతృత్వంలోనూ తనకు తానే సాటి అని ప్రతిసారీ నిరూపించుకుంటూనే ఉన్నాడు. గతేడాది కొవిడ్ తొలిసారి విరుచుకుపడిన సమయంలో పీఎం కేర్స్‌తోపాటు మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం ఇచ్చాడు. అవసరమైన వాళ్లకు పీపీఈ కిట్లను అందించాడు. ఇక ఇప్పుడు అదే కరోనా కారణంగా ఐపీఎల్ వాయిదా పడటంతో వెంటనే కొవిడ్ సహాయక చర్యల్లో మునిగిపోయాడు. లీగ్‌లో కరోనా సోకిన ప్లేయర్స్ సంఖ్య నాలుగుకు చేరడంతో మంగళవారం టోర్నీని వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించిన విషయం తెలుసు కదా.
ఆ వెంటనే అహ్మదాబాద్ నుంచి ముంబై వెళ్లిపోయిన కోహ్లి.. ఏమాత్రం సమయం వృథా చేయకుండా కొవిడ్ సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాడు. ఈ విషయాన్ని యువసేన సభ్యుడు రాహుల్ కనాల్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. కోహ్లి తమతో కలిసి పని చేస్తున్నాడని చెబుతూ ఫొటోలను షేర్ చేశాడు. ఇప్పటికే కోహ్లి భార్య అనుష్క శర్మ కూడా కొవిడ్ సహాయక చర్యల్లో పాలుపంచుకుంటోంది.
Meeting our Captain…Respect and love for the movement he has started working on for COVID relief… No words just Respect and Prayers for all his efforts !!! @imVkohli 🙏 pic.twitter.com/qZEQEKzgM7
— Rrahul Narain Kanal (@Iamrahulkanal) May 5, 2021