IPL 2025 : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్‌ల మధ్య చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్ టాస్ మరింత ఆలస్యం కానుంది. వాన ఎంతకూ తగ్గకపోవడంతో చివరకు ఓవర్లను కుదించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో, కనీసం 5 ఓవర్ల మ్యాచ్ నిర్వహించేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. వర్షం పూర్తిగా తగ్గి.. ఔట్‌ఫీల్డ్ కాస్త పొడిగా మారితే టాస్ 10:41 గంటలకు వేస్తారు. ఆ తర్వాత 15 నిమిషాలకు అంటే.. 10:56కు మ్యాచ్ మొదలవ్వనుంది.
గత రెండు రోజుల నుంచి బెంగళూరు కనీసం రెండు గంటలు వాన పడుతోంది. శుక్రవారం కూడా అదే పరిస్థితి కొనసాగింది. ఈసారి చిన్నస్వామిలో విజయం కోసం నిరీక్షిస్తున్న ఆర్సీబీని ఉత్సాహరిచేందుకు వేలాదిగా ఫ్యాన్స్ స్టేడియానికి చేరుకున్నారు. తీరా టాస్కు ముందే వాన మొదలైంది. రెండు గంటలైనా సరే తెరిపినివ్వలేదు.
🚨FINALLY THE WAIT IS OVER 🚨
The Rain has stopped. Play to start in a few minutes 😁#RCBvPBKS #RCBvsPBKS #ViratKohli pic.twitter.com/dyBWmNEL9p
— CricketTak (@_CricketTak) April 18, 2025
చినుకులు 8:45 సమయానికి తగ్గడంతో పిచ్, ఔట్‌ఫీల్డ్‌ను పరిశీలించిన అంపైర్లు, రిఫరీ.. 5 ఓవర్ల మ్యాచ్‌కు మొగ్గు చూపారు. రాత్రి 10:41కు టాస్ వేసి.. 10:56కు మ్యాచ్ ప్రారంభించనున్నారు. ఈ ఎడిషన్‌లో చెరో 4 విజయాలు సాధించిన ఆర్సీబీ, పంజాబ్‌లు ప్లే ఆఫ్స్ రేసులో ముందున్నాయి. కీలకమైన ఈ పోరులోనూ జయభేరి మోగించి టాప్ 2కు దూసుకెళ్లాలనుకున్న ఈ జట్లకు వరుణుడు పెద్ద షాకిచ్చాడు. ఐపీఎల్ 18వ సీజన్లో వరుణుడు కారణంగా టాస్ ఆలస్యం కావడం.. ఓవర్లు కుదించడం ఇదే మొదటిసారి.