INDW vs NZW : భారత బౌలర్లు చెలరేగిపోతున్నారు. రికార్డు ఛేదనకు దిగిన న్యూజిలాండ్‌ను కష్టాల్లోకి నెడుతూ వికెట్లు తీస్తున్నారు. టాపార్డర్ కుప్పకూలిన వేళ.. కీలక ఇన్నింగ్స్ ఆడుతున్న అమేలియా కేర్( 45) సైతం ఔటయ్యింది. సాధించాల్సిన రన్‌రేటు 9కి చేరడంతో పెద్ద షాట్లు ఆడబోయిన అమేలియా.. స్నేహ్ రానా ఓవర్లో మిడాన్‌లో బౌండరీకి యత్నించింది.
కానీ, అక్కడే ఉన్న స్మృతి మంధాన జంప్ చేస్తూ సూపర్ క్యాచ్ పట్టడంతో ఆమె వెనుదిరిగింది. అంతే.. జట్టు స్కోర్ 100 దాటించిన జోడీని విడదీసింది రానా. అమేలియా ఔట్ కావడంవతో 115 వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది వైట్ ఫెర్న్స్. ప్రస్తుతం బ్రూక్ హల్లిడే(31), మ్యాడీ గ్రీన్(11) జట్టును ఓటమి అంతరాన్ని తప్పించేందుకు పోరాడుతున్నారు. 24 ఓవర్లకు స్కోర్.. 121-4.