హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ ఆర్చరీ అసోసియేషిన్ అధ్యక్షుడిగా హైకోర్టులో ప్రముఖ న్యాయవాది టి. రాజు ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆదివారం జరిగిన ఎన్నికలలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్టు అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. అధ్యక్షుడిగా రాజు, ఉపాధ్యక్షుడిగా ఎల్.బి. లక్ష్మీకాంత్ రాథోడ్, ప్రధాన కార్యదర్శిగా పి. అరవింద్ కుమార్, కోశాధికారిగా కంచర్ల సత్యప్రసాద్, సహాయ కార్యదర్శిగా ఎస్. విజయ్‌కుమార్ రెడ్డి ఎన్నికైనట్టు ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు టి.రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్చరీకి పూర్వవైభవాన్ని తీసుకొస్తామని, ఆర్చర్ల నైపుణ్యతను పెంచే కోచింగ్ క్యాంపులను నిర్వహిస్తామని తెలిపారు.