కేసముద్రం, జూలై 29 : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం స్టేషన్ హైస్కూల్ వ్యాయామ ఉపాధ్యాయుడు కొమ్ము రాజేందర్ పారాలింపిక్ బ్యాడ్మింటన్ పోటీల అంపైర్ (టెక్నికల్ అఫీషియల్)గా ఎంపికయ్యాడు. ఈ క్రీడలు వచ్చే నెల 28 నుంచి సెప్టెంబర్ 8 వరకు పారిస్‌లో జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను వరంగల్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రమేశ్, రమేశ్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. గతంలోనూ అనేక అంతర్జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఆయన అంపైర్‌గా వ్యవహరించినట్లు వారు తెలిపారు.