Canada Open | క్వార్టర్స్‌లో రజావత్.. డబల్స్‌లో త్రిసా-గాయత్రి ముందంజ
Canada Open : భారత యువ షట్లర్ ప్రియాన్షు రజావత్(Priyanshu Rajawat) కెనడా ఓపెన్‌లో క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. మహిళల డబుల్స్‌లో త్రిసా జాలీ (Treesa Jolly) - గాయత్రి గోపిచంద్(Gayatri Gopichand)లు సైతం క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు.
Canada Open : భారత యువ షట్లర్ ప్రియాన్షు రజావత్(Priyanshu Rajawat) కెనడా ఓపెన్‌లో క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. మహిళల డబుల్స్‌లో త్రిసా జాలీ (Treesa Jolly) – గాయత్రి గోపిచంద్(Gayatri Gopichand)లు సైతం క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. తకుమా ఒబయశిని(జపాన్)తో శుక్రవారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో రజావత్ తన రాకెట్ పవర్ చూపించాడు.
తన కంటే మెరుగైన ర్యాంకర్ అయిన తకుమాకు రజావత్ వరుస సెట్లలో చుక్కలు చూపించాడు. వరుస సెట్లలో21-19, 21-11తో జయభేరి మోగించి క్వార్టర్స్‌లో కాలు మోపాడు. తర్వాతి రౌండ్లో నాలుగో సీడ్ అండర్స్ ఆంటోన్సెన్తో భారత షట్లర్ తలపడనున్నాడు.
Priyanshu Rajawat 🇮🇳 goes up against Takuma Obayashi 🇯🇵.#BWFWorldTour #CanadaOpen2024 pic.twitter.com/lddhVAEOk5
— BWF (@bwfmedia) July 5, 2024
ఇక మహిళల డబుల్స్‌లో త్రిసా, గాయత్రి జోడీ అదరగొట్టింది. తమకంటే తక్కవ ర్యాంక్ ద్వయమైన నటస్జా ఆంధోనిసెన్, అలిస్సా ట్రిస్టోసెటొనోపై విక్టరీ సాధించింది. తొలి సెట్ కోల్పోయినా పట్టువిడువక పోరాడిన త్రిసా, గాయత్రి జంట 17-21, 21-7, 21-8తో అలవోకగా గెలుపొందింది. మరో మ్యాచ్‌లో కృష్ణ సాయి, అనుపమలు.. మిక్స్డ్ డబుల్స్‌లో రోహన్, రుత్వికలు ఓటమి పాలయ్యారు.
ఇవి కూడా చదవండి
- Rohit Sharma | వరల్డ్ కప్ వీరుడికి అపూర్వ స్వాగతం.. వీడియో వైరల్
- UK PM | బ్రిటన్‌లో మార్పు మొదలైంది.. పునర్నిర్మాణంపై దృష్టి సారిస్తాం : కీర్ స్టార్మర్
- Bharateeyudu 2 | ‘భారతీయుడు 2’ సిద్దార్థ్‌ను బిజీ చేస్తుందా?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ACB Net | రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

