Bharateeyudu 2 | ‘భారతీయుడు 2’ సిద్దార్థ్‌ను బిజీ చేస్తుందా?
Indian 2 | విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Hasan), భారీ చిత్రాల దర్శకుడు శంకర్(Shankar) కలయికలో 1996లో వచ్చిన హిట్ చిత్రం భారతీయుడు(Bharateeyudu). ఇప్పుడు ఇదే కలయికలో దాని సీక్వెల్‌గా రాబోతున్న చిత్రం భారతీయుడు-2 (Bharateeyudu). ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Indian 2 | విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Hasan), భారీ చిత్రాల దర్శకుడు శంకర్(Shankar) కలయికలో 1996లో వచ్చిన హిట్ చిత్రం భారతీయుడు(Bharateeyudu). ఇప్పుడు ఇదే కలయికలో దాని సీక్వెల్‌గా రాబోతున్న చిత్రం భారతీయుడు-2 (Bharateeyudu 2). ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు నటుడు సిద్ధార్థ్ (Siddarth).
ఈ చిత్రంలో ఆయన పాత్ర కీలకంగా వుండనుందని ఇటీవల విడుదలైన భారతీయుడు-2 థియేట్రికల్ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అంతేకాదు ఈ ట్రైలర్లో కమల్‌హాసన్ కంటే ఎక్కువ షాట్స్‌లో సిద్డార్థే కనిపించారని అని కామెంట్స్ కూడా వచ్చాయి. ఇక భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న ఈ చిత్రంపైన హీరో సిద్దార్థ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. గత కొంతకాలంగా తెలుగు,తమిళ భాషల్లో సరైన విజయం కోసం తహతహలాడుతున్న సిద్దార్థ్ ఈ విజయంతో మునుపటి ఫామ్‌లోకి రావాలని ఆయన అభిమానులు సైతం కోరుకుంటున్నారు.
తెలుగులో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, ఓయ్ చిత్రాలతో యూత్‌లో క్రేజీ
కథనాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్న సిద్దార్థ్‌ను ఆ తరువాత సరైన విజయం వరించలేదు. బొమ్మరిల్లు తరువాత ఆయన నటించిన చుక్కలో చంద్రుడు, ఆట, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓయ్, బావ, అనగనగా ఓ ధీరుడు, ఓ మై ఫ్రెండ్, జబర్థస్త్, మహాసముద్రం ఇలా ఓ వరుసగా ఫ్లాప్‌లను చవిచూశాడు సిద్దార్థ్. అయితే గత కొంతకాలంగా పెద్ద కాంబినేషన్లో సినిమా చేయాలని ఎదురుచూస్తున్న ఈ హీరోకి భారతీయుడు-2 సినిమా మంచి అవకాశమనే చెప్పాలి. ఈ సినిమాతో సిద్దును విజయం వరిస్తే.. హీరోగా మంచి బ్రేక్ వస్తుంది.. కెరీర్‌కు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమవుతుంది. అంతేకాదు ఈ చిత్రం ఫలితం తరువాతే మిగతా సినిమాలు ఒప్పుకోవాలని, గత కొంతకాలంగా ఏ సినిమాలు సిద్దార్థ్ ఒప్పుకోలేదని తెలిసింది.
ప్రస్తుతం సిద్దార్థ్, బాలీవుడ్ కథానాయిక అతిథిరావు హైదరీతో ప్రేమలో వున్నాడు. ఇటీవల వీరి నిశ్చితార్థం కూడా జరిగింది. వీరి ఎంగేజ్మెంట్ న్యూస్‌ను కూడా ఈ జంట బాహాటంగానే ప్రకటించారు. ఇరు కుటుంబాల అంగీకారంతోనే త్వరలోనే ఈ జంట వివాహాబంధంతో ఒక్కటి కానున్నారు. ఇంతకుముందే సిద్దార్థ్‌కు వివాహం జరిగిన సంగతి తెలిసిందే. సిద్దార్థ్ – మేఘనా నారాయణ్ 2003లో పెళ్లి చేసుకోగా.. అనుకోని కారణాలతో 2007లో విడిపోయారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

