PAKW vs SAW : ఈసారి కొలంబోలో ప్రతి వరల్డ్ కప్ మ్యాచ్‌కు అడ్డుపడుతున్న వర్షం.. మళ్లీ విరుచుకుపడింది. ప్రేమదాస స్టేడియంలో మంగళవారం దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ మ్యాచ్‌కు అంతరాయం కలిగించింది. రెండో ఓవర్ పూర్తి కాగానే వాన మొదలైంది. దాంతో.. అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. దాదాపు 40 నిమిషాల తర్వాత వాన తగ్గడంతో సిబ్బంది సూపర్ సాపర్స్ సాయంతో ఔట్‌ఫీల్డ్‌ను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తతానికి సఫారీ స్కోర్.. 6/1.
టాసె గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్థాన్.. ఆదిలోనే వికెట్ తీసి సఫారీలకు షాకిచ్చింది. ఇంగ్లండ్‌పై మూడు వికెట్లు తీసిన కెప్టెన్ ఫాతిమా సనా తన పేస్ పవర్ చూపిస్తూ డేజంరస్ తంజిమ్ బ్రిట్స్(0)ను డకౌట్‌గా వెనక్కి పంపింది. ఆమె ఓవర్ ముగియగానే వర్షం అందుకుంది. దాంతో.. అంపైర్లు ఆటను నిలిపివేశారు. అప్పటికి కెప్టెన్ లారా వొల్వార్డ్త్(4 నాటౌట్), సునే లుస్(0)లు క్రీజులో ఉన్నారు. 40 నిమిషాలకు వర్షం తగ్గడంతో ఓవర్ల కోత లేకుండానే ఆడించనున్నారు.