Bangladesh vs Pakistan | రావల్పిండి: సొంతగడ్డపై తన కంటే తక్కువ ర్యాంకు కలిగిన బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఘోర పరాభవం తప్పేట్టు లేదు. రావల్పిండి వేదికగా బంగ్లాతో జరుగుతున్న రెండో టెస్టులో నాలుగో రోజు సెకండ్ ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే ఆలౌట్ అయిన పాక్.. ప్రత్యర్థి ఎదుట 185 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది.
బంగ్లా యువ పేసర్లు హసన్ మహ్ముద్ (5/43), నహీద్ రాణా (4/44) ధాటికి పాక్ బ్యాటింగ్ లైనప్ విలవిల్లాడింది. నాలుగో రోజు వర్షం వల్ల ఆట ముగిసే సమయానికి బంగ్లా 7 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 42 పరుగులు చేసింది. పాక్‌ను క్లీన్‌స్వీప్ చేసేందుకు పర్యాటక జట్టుకు మరో 143 పరుగులు మాత్రమే కావాల్సి ఉంది.