Rahul Dravid | బెంగళూరు: క్రికెట్లో అరుదైన దృశ్యం ఆవిషృతమైంది. తండ్రి, కొడుకు ఇద్దరు కలిసి ఒకే మ్యాచ్‌లో బరిలోకి దిగారు. వారు మరెవరో కాదు భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ తండ్రి, అతని తనయుడు అన్వయ్..కర్నాటక మూడో డివిజన్ టోర్నీలో కలిసి ఆడారు.
విజయ్ క్రికెట్ క్లబ్ తరఫున ప్రాతినిధ్యం వహించిన ద్రవిడ్ ఆరో నంబర్లో బ్యాటింగ్‌కు వచ్చి 10 పరుగులు చేయగా, అన్వయ్(58) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. వీరికి తోడు స్వప్నిల్(50 బంతుల్లో 107, 12ఫోర్లు, 4సిక్స్‌లు) సెంచరీతో విజయ్ క్రికెట్ క్లబ్ 345 స్కోరు చేసింది. అన్వయ్ నాలుగు వికెట్లతో ఆకట్టుకున్నాడు. అయినా క్రికెట్లో ఇది కొత్తేం కాదు.