IPL 2025 : గుజరాత్ స్పిన్నర్ల విజృంభణతో కోల్‌కతా కీలక వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న కెప్టెన్ అజింక్యా రహానే(50) ఔటయ్యాడు. సుందర్ బౌలింగ్‌లో సింగిల్ తీసి అర్ధ శతకం సాధించిన రహానే.. ఔట్ సైడ్ పడిన బంతిని ఆడబోయాడు. కానీ, బంతి మిస్ కాగా బట్లర్ రెప్పపాటులో స్టంపౌట్ చేశాడు. దాంతో, 91 వద్ద ఆతిథ్య జట్టు 4వ వికెట్ పడింది. ప్రస్తుతం రింకూ సింగ్(5), ఆండ్రూ రస్సెల్(12) కోల్‌కతాను గెలిపించే బాధ్యత తీసుకున్నారు. 14 ఓవర్లకు కోల్‌కతా స్కోర్.. 108-4. ఇంకా విజయానికి 91 కావాలి.
సొంత మైదానంలో ఛేదనకు దిగిన కోల్‌కతాను సిరాజ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే దెబ్బకొట్టాడు. ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న రహ్మనుల్లా గుర్బాజ్(1)ను ఎల్బీగా వెనక్కి పంపాడు. అయితే.. అజింక్యా రహానే(50), సునీల్ నరైన్(17)లు దూకుడుగా ఆడి స్కోర్ వేగం పెంచారు. ఈ జోడీని విడదీసేందుకు స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు బంతి అందించిన గిల్ సఫలం అయ్యాడు.
Skipper Ajinkya Rahane departs after his half-century ☝#GT continue to chip away at the wickets 👏
Updates ▶ https://t.co/TwaiwD55gP#TATAIPL | #KKRvGT | @KKRiders | @gujarat_titans pic.twitter.com/ZKK7vrX4c9
— IndianPremierLeague (@IPL) April 21, 2025
నరైన్ వెనుదిరిగాక వెంకటేశ్ అయ్యర్(14)తో కలిసి రహానే ఆచితూచి ఆడాడు. రషీద్, సాయి కిశోర్‌లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో 10 ఓవర్లకు స్కోర్ 68 మాత్రమే. ఆ తర్వాత స్పీడ్ పెంచిన రహానే.. సుందర్ బౌలింగ్‌లో కళ్లు చెదిరేలా 4, 6 బాదాడు. అప్పటికీ సాధించాల్సిన రన్ రేటు 13కు పైనే ఉండడంతో కిశోర్ వేసిన 12వ ఓవర్లో అయ్యర్ పెద్ద షాట్ ఆడి..సుందర్ చేతికి దొరికాడు. ఆ కాసేపటికే అర్ద శతకం పూర్తి చేసుకున్న రహానే.. సుందర్ బౌలింగ్‌లో ఆఫ్ స్టంప్ పడిన బంతిని ఆడబోయి గురి తప్పాడు. బంతి అందుకున్న బట్లర్ రెప్పపాటులో స్టంపౌట్ చేసి కోల్‌కతాను ఒత్తిడిలోకి నెట్టాడు.