మెల్బోర్న్: వీసా రద్దు కేసులో టెన్నిస్ స్టార్ జోకోవిచ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. దీనిపై మరో టెన్నిస్ దిగ్గజం రఫేల్ నాదల్ స్పందించారు. న్యాయం గెలిచిందని, అందుకే జోకోవిచ్ను ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఆడనివ్వాలని నాదల్ తెలిపాడు. జోకోవిచ్ దాఖలు చేసిన కేసులో అతను గెలిచాడని, దాని ఆధారంగా ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఆడేందుకు అతనికి అవకాశం కల్పించాలన్న అభిప్రాయాన్ని నాదల్ వ్యక్తం చేశాడు. డిసెంబర్ 17వ తేదీ నుంచి ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రారంభం కానున్నది. అయితే ఆ టోర్నీలో ఈ ఇద్దరే ఫెవరేట్లు. ఇప్పటికే ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీని జోకోవిచ్ తొమ్మిదిసార్లు గెలిచాడు. వ్యాక్సిన్ మినహాయింపు అంశంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం జోకో వీసాను రద్దు చేసిన విషయం తెలిసిందే. దాన్ని సవాల్ చేస్తూ జోకో కోర్టును ఆశ్రయించారు. ఇవాళ కోర్టు తన తీర్పులో జోకోకు విముక్తిని కల్పించింది. డిటెన్షన్ సెంటర్ నుంచి జోకోను తక్షణమే రిలీజ్ చేయాలని కోర్టు ఆదేశించింది. వీసా రద్దు కేసులో జోకోవిచ్ నెగ్గినా.. అతని వీసాను లాక్కునే అధికారం ఆ దేశ ఇమ్మిగ్రేషన్ శాఖకు ఉన్నట్లు తెలుస్తోంది.