Rafeal Nadal | ‘స్పెయిన్ బుల్’ వచ్చేస్తున్నాడు.. రీ- ఎంట్రీ ఎప్పుడంటే..?
Rafeal Nadal : మాజీ వరల్డ్ నంబర్ 1 రఫెల్ నాదల్(Rafeal Nadal) మళ్లీ రాకెట్ అందుకుంటున్నాడు. తొడ కండరాల గాయం కారణంగా దాదాపు ఏడాది కాలంగా ఆటకు దూరమైన రఫా మళ్లీ ఫ్యాన్స్‌ను అలరించనున్నాడు. అవును.. వచ్చే ఏడాది జనవరిలో బ్రిస్బేన్ ఇంటర్నేషనల్(Brisbane International) టోర్నీతో...
Rafeal Nadal : మాజీ వరల్డ్ నంబర్ 1 రఫెల్ నాదల్(Rafeal Nadal) మళ్లీ రాకెట్ అందుకుంటున్నాడు. తొడ కండరాల గాయం కారణంగా దాదాపు ఏడాది కాలంగా ఆటకు దూరమైన రఫా మళ్లీ ఫ్యాన్స్‌ను అలరించనున్నాడు. అవును.. వచ్చే ఏడాది జనవరిలో బ్రిస్బేన్ ఇంటర్నేషనల్(Brisbane International) టోర్నీతో నాదల్ కోర్టులో అడుగుపెడుతున్నాడు. ఈ విషయాన్ని ‘క్లే కోర్ట్ కింగ్’ సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.
‘అందరికీ నమస్తే. టెన్నిస్ కోర్టుకు ఏడాది విరామం తర్వాత మళ్లీ బరిలోకి దిగుతున్నా. పునరాగమనానికి సమయం వచ్చేసింది. జనవరి మొదటివారంలో జరిగే బ్రిస్బేన్ టోర్నీతో ఎంట్రీ ఇస్తున్నా. మీ అందర్నీ అక్కడ కలుస్తాను. ఈ ఏడాదిని ఇలా ముగించాలని నేను అనుకోలేదు. కెరీర్ ఆసాంతం నేను ఎంతో కష్టపడ్డాను. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌తో నా ఆటకు ముగింపు పడలేదు. నేను గొప్పగా నా కెరీర్‌ను ముగిస్తాను’ అని నాదల్ వీడియోలో వెల్లడించాడు.
🎧👀💪🏻😉 pic.twitter.com/iH7NvsQGMT
— Rafa Nadal (@RafaelNadal) December 1, 2023
ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్(Australian Open) రెండో రౌండ్లోనే నాదల్ వెనుదిరిగాడు. మెకంజీ మెక్‌డొనాల్డ్ చేతిలో ఓటమి పాలయ్యాడు. అనంతరం తొడ కండరాల గాయం వేధించడంతో రఫా రాకెట్ ముట్టలేదు. ఈ సమయంలోనే అతడి 22 గ్రాండ్‌స్లామ్స్ రికార్డును నొవాక్ జకోవిచ్ బద్ధలు కొట్టాడు. అంతేకాదు నాదల్ 20 ఏండ్లలో తొలిసారి వంద కంటే తక్కువ ర్యాంక్‌కు పడిపోయాడు. ప్రస్తుతం రఫా 663 ర్యాంకులో కొనసాగుతున్నాడు. బ్రిస్బేన్ టోర్నీలో సత్తా చాటితే అతడి ర్యాంక్ మెరుగయ్యే చాన్స్ ఉంది. ఈ టోర్నీ డిసెంబర్ 31 నుంచి జనవరి 7 వరకు జరగనుంది.
ఇవి కూడా చదవండి
-
Hyderabad | సూరారంలో డ్రగ్స్ తయారీ ముఠా అరెస్ట్.. మాదక ద్రవ్యాలు సీజ్
-
Mike Tyson: మూడు కోట్లు ఇవ్వండి.. మైక్ టైసన్‌కు లీగల్ వార్నింగ్
-
Lionel Messi | మెస్సీ మరో వరల్డ్ కప్ ఆడతాడా..? అతడి మనసులో ఏముంది..?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

