Mike Tyson: మూడు కోట్లు ఇవ్వండి.. మైక్ టైసన్‌కు లీగల్ వార్నింగ్
Mike Tyson: ఓ విమాన ప్రయాణికుడిని గత ఏడాది మైక్ టైసన్ కొట్టిన విషయం తెలిసిందే. తనకు మూడు కోట్లు చెల్లించాలని ఆ వ్యక్తి డిమాండ్ చేశాడు. ఈ నేపథ్యంలో టైసన్‌కు లీగల్ వార్నింగ్ కూడా ఇచ్చాడు.
లాస్ ఏంజిల్స్: మాజీ హెవీవెయిట్ బాక్సర్ మైక్ టైసన్(Mike Tyson) భారీ జరిమానా కట్టే అవకాశాలు ఉన్నాయి. విమానంలో ఓ ప్రయాణికుడికి పంచ్ ఇచ్చిన కేసులో అతనికి ఫైన్ వేయనున్నారు. సుమారు మూడున్నర లక్షల పౌండ్లు అంటే మూడు కోట్ల వరకు అతను జరిమానా కట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 2022 ఏప్రిల్‌లో శాన్ఫ్రాన్సిస్కో నుంచి వస్తున్న విమానంలో మెల్విన్ టౌన్సెండ్ అనే వ్యక్తిపై టైసన్ దాడి చేశాడు. వెనుక సీటులో ఉన్న టైసన్ తన పంచ్‌లతో విరుచుకుపడ్డాడు. అయితే ఆ ప్రయాణికుడు దూకుడుగా వ్యవహరించడం వల్లే టైసన్ దాడికి దిగినట్లు అతని తరపు న్యాయవాది తెలిపాడు.
బాధిత మెల్విన్ ఇప్పుడు మూడు కోట్లు డిమాండ్ చేస్తూ టైసన్‌పై కేసు వేశాడు. వైద్య ఖర్చులు ఎక్కువ అయినట్లు అతను వెల్లడించారు. తల, మెడకు బలమైన గాయం కావడం వల్ల తన క్లయింట్ స్పృహ తప్పినట్లు ఫిర్యాదులో తెలిపారు. దాడి జరిగిన సమయంలో ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల ఎక్కువ మెడికల్ బిల్లులు కట్టాల్సి వస్తోందని టౌన్సెండ్ తెలిపాడు. టైసన్ ప్రతినిధికి లేఖ రాసిన టౌన్‌సెంట్ న్యాయవాదులు.. ఒకవేళ ఆ లేఖకు స్పందించకుంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

