T20 World Cup 2026 : వన్డే ప్రపంచకప్ ఛాంపియన్‌గా అవతరించిన భారత మహిళల జట్టు మరో ఐసీసీ ట్రోఫీ లక్ష్యంగా కదులుతోంది. ఇంగ్లండ్ వేదికగా జూన్ 12 నుంచి మొదలయ్యే పొట్టి ప్రపంచకప్ కోసం సెలెక్టర్లు స్క్వాడ్‌ను ప్రకటించారు. టీమిండియాకు తొలి ప్రపంచకప్ అందించిన హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) సారథ్యంలో 15 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేశారు. డబ్ల్యూపీఎల్‌లో అద్భుతంగా రాణించిన అనుష్క శర్మ(Anushka Sharma), హ్యాట్రిక్ పేసర్ నందిని శర్మ.. గాయంతో ఆస్ట్రేలియా పర్యటనకు దూరమైన యస్తికా భాటియాలకు స్క్వాడ్‌లో చోటు దక్కింది.
టీ20 ప్రపంచకప్ లక్ష్యంగా పెట్టుకున్న భారత జట్టు ఆతిథ్య ఇంగ్లండ్‌తో రెండు ఫార్మాట్ల సిరీస్ ఆడనుంది. దాంతో, పొట్టి సిరీస్‌తో పాటు ప్రపంచకప్ కోసం శనివారం సెలెక్టర్లు స్క్వాడ్‌ను ప్రకటించారు. బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియాతో సమావేశమైన సెలెక్షన్ కమిటీ చైర్మన్ అమితా శర్మ, కోచ్ అన్మోల్ మజుందార్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌లు స్క్వాడ్ కసరత్తును పూర్తి చేశారు.
The day we’ve all been waiting for 👌
Stay tuned for #TeamIndia‘s ICC Women’s #T20WorldCup 2026 squad announcement later today 🤩 🇮🇳
Drop your squad predictions below 👇 pic.twitter.com/B5JOzrjvU2
— BCCI Women (@BCCIWomen) May 2, 2026
వన్డే వరల్డ్‌కప్ ఆడిన బృందంలోని 12 మందితో పాటు డబ్ల్యూపీఎల్ స్టార్లను తీసుకున్నారు. ఆల్రౌండర్లుగా శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్, దీప్తి శర్మలు ఎంపికవ్వగా.. ఆశ్చర్యంగా అమన్‌జోత్ కౌర్, మిస్టరీ స్పిన్నర్ వైష్ణవీ శర్మలకు చోటు దక్కలేదు. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారతి ఫుల్మాలి, మోకాలి గాయంతో బాధ పడుతున్న కష్వీ గౌతమ్, మోకాలి గాయం నుంచి కోలుకున్న ఓపెనర్ ప్రతీకా రావల్‌ను పక్కన పెట్టేశారు. అయితే.. ఏకైక టెస్టు స్క్వాడ్‌లో సీనియర్లు హర్లీన్ డియోల్, స్నేహ్ రాణాతో పాటు ప్రతీకను ఎంపిక చేశారు.
India announce their squad for the Women’s T20 World Cup 🚨
Details: https://t.co/dppAnH7925 pic.twitter.com/TqGe9TcQuR
— ESPNcricinfo (@ESPNcricinfo) May 2, 2026
భారత స్క్వాడ్ : హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, రీచా ఘోష్(వికెట్ కీపర్), యస్తికా భాటియా(వికెట్ కీపర్), రాధా యాదవ్, జెమీమా రోడ్రిగ్స్, శ్రేయాంక పాటిల్, శ్రీ చరణి, అరుంధతి రెడ్డి, అనుష్క శర్మ, దీప్తి శర్మ, నందిని శర్మ, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్.
లార్డ్స్ టెస్టుకు భారత స్క్వాడ్ : హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, ప్రతీకా రావల్, శ్రీ చరణి, యస్తికా భాటియా, నందిని శర్మ, హర్లీన్ డియోల్, రేణుకా సింగ్, క్రాంతి గౌడ్, సయాలీ సత్ఘరే, స్నేహ్ రాణా.